పుష్ప: ది రైజ్ సినిమా, పాటలు అనూహ్యమైన రికార్డులు సృష్టిస్తున్నాయి.
ఒక ప్రాంతీయ సినిమా పాన్ ఇండియా సినిమాగా మారడం చాలా పెద్ద విషయం.
తాజాగా ఈ సినిమాని ఒక పాటను ఆంగ్ల భాషలోకి అనువదించారు. అది కూడా ఫేమస్ డచ్ సింగర్ ఎమ్మా హీస్టర్స్ ఆ పాటను పాడారు.
ఈ సినిమా సంగీతం చార్ట్‌బస్టర్‌గా మారింది,
దేవి శ్రీ ప్రసాద్ కూర్చిన స్వరాలు పిచ్చెక్కిస్తున్నాయి.
మొన్ననే శ్రీవల్లి పాటు ఉత్తరాది ఎన్నికల్లో కూడా వాడటం చూశాం.
తాజాగా ఎమ్మా హీస్టర్స్ పాడి దీనిని వైరల్ చేశారు.
చిత్ర సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఇంగ్లీష్ వెర్షన్‌ను ట్విట్టర్లో షేర్ చేస్తూ, “ఈ ట్రాక్ నాకు నచ్చింది. హే @sidsriram బ్రో, మేము రికార్డ్ చేసినప్పుడు నేను మీకు చెప్పాను, వినోదం కోసం ఒక ఆంగ్ల వెర్షన్ చేద్దాం, కానీ ఇక్కడ @emmaheesters ద్వారా అది జరిగిపోయింది … అని దేవి శ్రీ ట్వీట్ చేశారు.
ఇప్పుడు ఇంగ్లీష్ గాయని ఎమ్మా హీస్టర్స్ శ్రీవల్లి ఆంగ్ల వెర్షన్ ను రికార్డ్ చేసారు. ఇంగ్లీష్ వెర్షన్లో కూడా చాలా బాగుంది. ఎమ్మా హీస్టర్స్ సూపర్ గా పాడారు. మీరు కూడా ఓ లుక్కేయండి.????????
— కన్నేపల్లి✨sarasa ✨Textrovert (@Ksravishankar2) February 6, 2022
ఈ పాటను పూర్తిగా చూడాలంటే ఈ వీడియో మీద క్లిక్ చేయండి.