• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఏపీలో ఎమ‌ర్జెన్సీ !!

NA bureau by NA bureau
January 5, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
chandrababu

chandrababu

0
SHARES
220
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో అప్ర‌క‌టిత ఎమ‌ర్జెన్సీ సాగుతోంద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ధ్వ‌జ‌మెత్తారు.  సీఎం జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని.. పిరికితనంతో తప్పుడు కేసులు పెట్టి తమ పర్యటనలను అడ్డుకోవాలను కుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు బాధపడుతుంటే.. శాడిస్ట్‌ సీఎం ఆనందపడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.

రోడ్డు షోలు, సభలపై నియంత్రణకు చీకటి జీవో తీసుకొచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ అరాచకశక్తిగా మారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పోలీసులు తీసుకెళ్లిన టీడీపీ చైతన్య రథం వాహనాన్ని వెంటనే తిరిగివ్వాలని డిమాండ్‌ చేశారు. చైతన్య రథాన్ని పోలీసులు తీసుకెళ్లినందుకు నిరసనగా ఆర్అండ్‌బీ అతిథిగృహం నుంచి ఎం.ఎం. కల్యాణ మండపం వరకు చంద్రబాబు పాదయాత్రగా వెళ్లారు.

40 ఏళ్లు పోరాడిన పార్టీ టీడీపీ అని.. ఎన్నో ఇబ్బందులను సమర్థంగా ఎదుర్కొన్నామన్నారు. రాష్ట్రాన్ని అంధకారం చేయకూడదని పోరాడుతున్నామని.. తప్పుడు కేసులు పెట్టి తమను అడ్డుకోవాలని చూస్తు న్నారని మండిపడ్డారు. ఎవరు కనపబడితే వాళ్లపై కేసు పెట్టి జైల్లో పెడతారా? అని నిలదీశారు.

తాను సీఎంగా ఉన్నప్పుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, షర్మిల, జగన్‌ పాదయాత్రలు చేశారని.. ఆ పాదయాత్ర లకు పోలీసు భద్రత కల్పించినట్లు తెలిపారు. ఇప్పుడు వీళ్లు మాత్రం తన నియోజకవర్గంలో తిరుగుతుం టే అడ్డుపడుతున్నారని ఆగ్రహించారు. దాడి చేసి తిరిగి తమ పైనే కేసులు పెడుతున్నారన్నారు.

చట్టాలను అతిక్రమించిన పోలీసులూ నేరస్థులేన‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. జిల్లా ఎస్పీ లా అండ్‌ ఆర్డర్‌ను కాపాడేందుకు వచ్చారా? టీడీపీ కార్యకర్తలపై దాడులకు వచ్చారా? అని నిలదీశారు. రోడ్డు షోలు రాష్ట్రానికి కొత్తా? గత 70 ఏళ్ల నుంచి జరగలేదా? జగన్‌ పాదయాత్రలో రోడ్డుషోలు జరగలేదా? అని ప్రశ్నించారు.

టీడీపీ నేతలు బయటకు రాకుండా చేసేందుకు పోలీసులు చేసిన కుట్రలో భాగంగానే కందుకూరు, గుంటూరు ఘటనలు జరిగాయని ఆరోపించారు. ఇప్పుడు కుప్పంలోనూ ఆ తరహాలోనే చేస్తున్నారని మండిపడ్డారు. ఏంటీ అరాచకాలు? అయినా తాము భయపడమని.. ప్రజాపోరాటం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడతామన్నారు.  చట్టాన్ని అతిక్రమించిన పోలీసులపై ప్రైవేటు కేసులు పెట్టి బోనెక్కిస్తామ‌ని చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు.

TDP chief #ChandrababuNaidu, alleged #YSRCP govt and AP police, for #stampede, calls it #conspiracy, at first intensionally less police personnel deployed for crowd management and then created stampede and later arresting the #TDP leaders.#conspiracyinstampede #AndhraPradesh pic.twitter.com/a9A7lQa66O

— Surya Reddy (@jsuryareddy) January 5, 2023

Tags: andhrapradeshChandrababuchitoorJagankuppam
Previous Post

ఏపీ : ప్ర‌భుత్వం బిల్లులు చెల్లించ‌క‌పోవ‌డంతో `కాంట్రాక్ట‌ర్‌`

Next Post

ఏపీలో పాలనపై వైఎస్ అభిమాని సంచలన కామెంట్స్

Related Posts

Top Stories

చంద్రగిరిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా ?

April 1, 2023
tdp and ycp logos
Top Stories

తెనాలి కౌన్సిల్ లో వైసీపీ-టీడీపీ కౌన్సిలర్ల బాహాబాహీ

April 1, 2023
Trending

వైసీపీలో ఉండేదెవరు ? ఊడేదెవరు ?

April 1, 2023
Top Stories

కేజ్రీవాల్ పై రూ.75 కోట్ల బాంబ్ వేసిన సుఖేశ్!

April 1, 2023
jagan salute
Andhra

మంత్రివర్గంలో మార్పుచేర్పులపై సీఎం జగన్ కసరత్తు!

April 1, 2023
nara lokesh
Politics

అవంతి-అంబ‌టిల‌ను ఓ ఆట ఆడేసుకున్న నారా లోకేష్‌

April 1, 2023
Load More
Next Post
jagan and ysr

ఏపీలో పాలనపై వైఎస్ అభిమాని సంచలన కామెంట్స్

Latest News

  • చంద్రగిరిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా ?
  • తెనాలి కౌన్సిల్ లో వైసీపీ-టీడీపీ కౌన్సిలర్ల బాహాబాహీ
  • వైసీపీలో ఉండేదెవరు ? ఊడేదెవరు ?
  • కేజ్రీవాల్ పై రూ.75 కోట్ల బాంబ్ వేసిన సుఖేశ్!
  • మంత్రివర్గంలో మార్పుచేర్పులపై సీఎం జగన్ కసరత్తు!
  • అవంతి-అంబ‌టిల‌ను ఓ ఆట ఆడేసుకున్న నారా లోకేష్‌
  • అమ‌రావ‌తిలో వైసీపీ నేత‌ల వీరంగం
  • ‘బతుకమ్మ’ కొత్త పాట!
  • కెన్ యూ ఆన్సర్ మిస్టర్ జగన్..  బాబు ట్వీట్ ఎందుకంత వైరల్?
  • మోడీ డిగ్రీలు … ఈ దాపరికం ఎందుకు?
  • బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు.. !
  • భారతీయ సంగీతం, నాట్యాలలో ‘సంపద – PSTU జూనియర్, సీనియర్ సర్టిఫికేట్  పరీక్షలు!
  • ఆవిర్భావం తెలంగాణ‌లో.. మ‌హానాడు ఏపీలో.. చంద్ర‌బాబు వ్యూహం ..!
  • సంచలనం… AP ఎలక్షన్ డేట్ 3వ తేదీ ప్రకటన ?
  • కేటీఆర్ ట్వీట్లకు బండి సంజయ్ పోట్లు

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

ఆస్కార్ ఖర్చుపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన కార్తికేయ

నెల్లూరు రెడ్ల హిస్ట‌రీలో `1983 రిపీట్`!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra