టెస్లా.. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలన్ మస్క్ కొత్తగా ఓ సామాజిక మాధ్యమాన్ని సృష్టించడం గురించి ఆలోచిస్తున్నారు. ప్రస్తు తం కీలక నేతలు, సీఈవోలకు.. ట్విట్టర్వేదిగా ఉంది. వారు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగానే పంచుకుంటున్నారు. అయి తే.. దీనిలో స్వేచ్ఛలేదని.. పైగాఆంక్షలు కూడా పెరిగిపోయాయని.. ఇటీవల కాలంలో విమర్శలు వస్తున్నాయి.
ఇది కూడా నిజ మే. ఎందుకంటే భావప్రకటనా స్వేచ్ఛ ముసుగులో రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. మతాల మధ్య చిచ్చు పెట్టేవారు.. పెరుగుతున్న నేప థ్యంలో ట్విట్టర్‌కు ప్రాధాన్యం తగ్గుతోంది. ఈ నేపథ్యంలోనే ఎలన్ సరికొత్త ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది.
ఇటీవల ఎలన్.. కొన్ని వర్గాలతో ముఖాముఖి చర్చించారు. స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చే వేదికగా ట్విటర్ పని చేస్తోందా? అని ఆయన అడిగినపుడు దాదాపు 70 శాతం మంది ‘లేదు’ అని సమాధానం చెప్పడంతో ఆయన ఈ ఆలోచన చేస్తున్నారు.
వాక్ స్వాతంత్ర్యం నిబంధనలకు అనుగుణంగా ట్విటర్ వ్యవహరిస్తోందని మీరు నమ్ముతున్నారా? అని ఎలన్ మస్క్ అడిగారు. ఈ పోల్ ఫలితాలు చాలా ముఖ్యమైనవని, అందువల్ల జాగ్రత్తగా నిర్ణయం తీసుకుని, ఓటు వేయాలని కోరారు. దీనికి స్పందించిన ట్విటరాటీలలో 70 శాతం మంది ‘లేదు’ అని చెప్పారు.
ఈ పోల్ ముగిసిన తర్వాత ఆయన మరొక ట్వీట్ చేశారు. వాక్ స్వాతంత్ర్యం నిబంధనలకు కట్టుబడి ఉండటంలో ట్విటర్ విఫలమ వుతోందని, ఇది ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడమేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలని ప్రశ్నించారు. కొత్త వేదిక అవసరమా? అని అడిగారు.
ఓ ట్విటరాటీ స్పందిస్తూ, స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం కల్పిస్తూ, వాక్ స్వాతంత్ర్యానికి పెద్ద పీట వేస్తూ, ఓ కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేయడంపై పరిశీలిస్తారా? అని అడిగారు. వాక్ స్వాతంత్ర్యానికి ప్రాధాన్యమిస్తూ, ప్రచారం అతి తక్కువగా ఉండే ప్లాట్‌ఫాంను సృష్టించడంపై పరిశీలిస్తారా? అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు ఎలన్ మస్క్ స్పందిస్తూ, తాను దీని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నానని తెలిపారు. ఆయన ట్విటర్‌ను, దాని విధానాలను తీవ్రంగా విమర్శిస్తారనే సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, ట్విటర్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా జెయింట్స్‌కు పోటీగా వచ్చిన వేదికలు చెప్పుకోదగ్గ స్థాయిలో విజయం సాధించలేకపోతున్నాయి.
ట్విటర్‌కు పోటీగా వచ్చిన Gettr, Parler, Koo, డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ట్రూత్ సోషల్ వంటివి ప్రజాదరణకు నోచుకోలేకపోతున్నాయి. ఈనేపథ్యంలో మస్క్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. మరి ఈయన ఎలాంటి వేదికతో ముందుకు వస్తారో.. దీనికి ఎంత ఆదరణ ఉంటుందో చూడాలి.