కాకినాడ కేంద్రంగా వేలాది టన్నుల అక్రమ రేషన్ బియ్యం తరలిపోతున్న వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరుగుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, విజయసాయిరెడ్డి అల్లుడుల హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి కొడాలి నానిపై మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
”రేయ్ కొడాలి.. ఎవడ్రా 420.. సీఎం జగన్.. నువ్వే 420లు… చంద్రబాబును 420 అంటారా..? రావి శోభనాద్రీశ్వరరావు కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచిందెవర్రా కొడాలి..? తెలుగు యువత పదవి ఇవ్వొద్దని చెప్పినా.. రావి శోభనాద్రీశ్వరరావు దయతో తెలుగు యువత అధ్యక్షుడివయ్యావు…జగన్ బూట్లు నాకితే నాకు.. అంతే కానీ చంద్రబాబును విమర్శిస్తావా..? నారా లోకేష్ పెళ్లికి చంద్రబాబు ఇంటి ముందు తాటాకు పందిరి వేసిన రోజులు మరిచావా..? నువ్వు చేసిన పనులు మరిచావా.. దరిద్రుడా..? ” అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
కేబినెట్లో ఉంటూ క్యాసినో ఆడించిన మంత్రి కొడాలి నాని రాజీనామా చేయాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. కొడాలి నాని, ద్వారంపూడి, విజయసాయి అల్లుడు కుమ్మక్కై లక్షల టన్నుల బియ్యాన్ని అక్రమంగా కాకినాడ పోర్టు నుంచి తరలిస్తున్నారని ఆరోపించారు. ఆ బియ్యం ఎగుమతులపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మర్డర్లు చేసి బ్యాలెన్స్డ్ అప్రోచుతో వెళ్లాలని సజ్జల ఎలా అంటారని ప్రశ్నించారు. వివేకా మరణం గుండెపోటన్న విజయసాయిపై కూడా సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.