ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తరపున ఎన్నికైన ప్రజా ప్రతినిధుల్ని ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన జనసేన నాయకులకు స్ట్రోంగ్ వార్నింగ్ ఇచ్చారు. జనసేన విజయం గొప్ప విజయమని.. 175లో 21 భారీ సంఖ్య కాకపోవచ్చు.. కానీ 164 రావడానికి జవసేన వెన్నెముకగా మారిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అయితే ఎంత సాధించినా ఒదిగి ఉండడం మంచిదని కార్యకర్తలకు ఆయన సూచించారు.
రాష్ట్రంలో వైసీపీ నేతలు శత్రువుల కాదని, రాజకీయ ప్రత్యర్థులు మాత్రమేనని.. వాళ్లను ద్వేషింయడం, వాళ్లు చేసిన తప్పులు చేయడం చేస్తే సహించేది లేదని పవన్ వార్నింగ్ ఇచ్చారు. పరుష పదజాలం వాడొద్దని.. నిజంగా వారితో గొడవ పడాల్సి వచ్చినపుడే తీవ్రత చూపించాలన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దని..బాధ్యతతో ప్రజల కోసం పని చేయాలని పవన్ తెలిపారు. నిత్యం ఒక్క ప్రజా ప్రతినిధి అయినా పార్టీ కార్యాలయంలో ఉండాలన్నారు. రౌడీయిజం చేయడం, దురుసుగా మాట్లాడ్డం సరికాదాన్నారు.
అలాగే పార్టీకి చెందిన వారు సామాజిక మాధ్యమాల్లో నోరు జారి మహిళల్ని కించపరిచినా, దూషించినా వేటు పడుద్దని హెచ్చరించారు. అలాంటి వారిని వదులుకోవడానికి తాను సిద్దంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. తాము లేకపోతే పార్టీ ఏమైపోతుంది అనే భ్రమలో ఎవరూ ఉండొద్దని.. విర్రవీగిన వాళ్లను ప్రజలు 11సీట్లకు పరిమితం చేశారని పవన్ గుర్తుచేశారు.
అంబానీ ఇంట పెళ్లిలో సనాతన ధర్మాన్ని నిలబెట్టారని చెబుతుంటే తనకు మరింత బాధ్యత పెరిగిందని.. జనం కోసం నా కుటుంబాన్ని పక్కన పెట్టేస్తానని.. ప్రజాస్వామ్య పరిరక్షణ విషయంలో రాజీ పడనని పవన్ తెలిపారు. ఇక పదవులు కోసం తనపై ఎవరు ఒత్తిడి చేయొద్దని..సరైన సమయంలో అందరికీ బాధ్యతలు అప్పగిస్తానని డిప్యూటీ సీఎం తెలిపారు.