కరోనా పోరులో కొత్త మలుపు తిరిగింది. భారతదేశంలో దాని ప్రభావం బాగా పడిపోయింది. దాదాపు అన్ని వ్యవస్థలు తిరిగి కోలుకునే పరిస్థితికి వచ్చాయి. ఇక తాజాగా భారతదేశపు కంపెనీలు తయారుచేసిన రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.
భారతదేశపు డ్రగ్ కంట్రోల్ విభాగా సీరం కంపెనీ, భారత్ బయోటెక్ తయారుచేసిన వ్యాక్సిన్ల వినియోగానికి అనుమతులు మంజూరు చేసింది. దీనిపై ప్రధాని ట్వీట్ చేస్తూ ఇదొక టర్నింగ్ పాయింట్, కోవిడ్ ఫ్రీ ఇండియాను చూడబోతున్నాం. కంగ్రాచ్యులేషన్స్ ఇండియా, కంగ్రాచ్చులేషన్ సైంటిస్ట్స్ అండ్ ఇన్నోవేటర్స్ అని మోడీ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ కావాలనుకున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. 75 లక్షల మంది ఇప్పటికే తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వాస్తానికి వ్యాక్సిన్ విషయంలో ఇంకా సందేహాలున్నాయి. పూర్తి నమ్మకం కలగలేదు. కాకపోతే ఇపుడున్న పరిస్థితులకు బెటర్ ఛాయిస్ కింద దీనిని చూస్తున్నారు.
ఇదిలా ఉండగా… ప్రధాని ట్వీట్ కు భారత్ బయోటెక్ కృతజ్జతలు తెలుపుతూ స్పందించింది. సీరం అధినేత పూనవాలా కూడా మోడీకి కృతజ్జతలు తెలిపారు.