ఏపీ సీఎం జగన్ ధరించే చెప్పుల ఖరీదు ఎంత ? అనే సందేహం ఇప్పటి వరకు ఎవరికీ అనుమానం వచ్చి ఉండదు. కానీ, టీడీపీ కి వచ్చింది. దీంతో దీనిపై శోధన చేసిన టీడీపీ నాయకుడు ఆనం వెంకట రమణారెడ్డి సంచలన విషయం వెల్లడించారు. దేశం లోనే అత్యంత పేద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉందంటూ టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి వ్యంగ్యాస్త్రం సంధించారు. రూపాయి జీతం మాత్రమే తీసుకుంటూ ఉప్మాతో ఆకలి తీర్చుకుంటున్నపేద సీఎం గురించి ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు.
ఈ సందర్భంగా పలు ఫోటోలను మీడియా ఎదుట ప్రదర్శించారు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు సాక్షి మీడియా తనది కాదన్నది సరేనన్న ఆనం.. భార్య భారతి కళ్లలో ఆనందం చూసేందుకు సాక్షి సర్క్యులేషన్ పెంచేలా వాలంటీర్లతో ఎందుకు కొనిపిస్తున్నా వని ప్రశ్నించారు. భారతి కళ్లల్లో ఆనందం చూడాలని సాక్షిలో కోట్లాది రూపాయల ప్రకటనలు ఎందుకిచ్చారని నిలదీశారు. చంద్ర బాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 60 రూపాయలు విలువ చేసే హిమాలయ మంచి నీళ్లు తాగితే సాక్షి మీడియా ద్వారా గగ్గోలు పెట్టారని గుర్తు చేశారు.
నేడు అదే జగన్ మోహన్ రెడ్డి.. 60 శాతం డిస్కౌంట్‌తోనే 5వేల 499 రూపాయల విలువ చేసి 750మిల్లీ లీటర్ మంచి నీళ్లు తాగు తున్న వైనంపై సాక్షిలో కథనం ఎందుకు రాలేదని నిలదీశారు. పేద ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి మొసలి చర్మంతో చేసి వాడే చెప్పుల ఖరీదు అక్షరాల 1లక్షా 34వేల 800 రూపాయలు అంటూ విమర్శించారు. ఆనాడు చంద్రబాబు మీడియా సమావేశంలో వాటర్ బాటిల్‌పై రాద్దాంతం చేశారు. ఇవాళ సీఎం జగన్ వాడుతున్న వాటర్ బాటిల్‌పై ఏమంటారు?. జగన్ వాడే వాటర్ బాటిల్ కంపెనీ ‘ఆవా’.. బాటిల్ ధర రూ.5వేల 499. రూ.6 వేలు పెట్టి వాటర్ బాటిల్ ఎవరైనా వాడతారా?. అని ప్రశ్నించారు.
“జగన్ వాడే చెప్పుల ధర ఎంతో తెలుసా… లక్షా 34 వేల 800. రబ్బర్ చెప్పుల నుంచి లక్షా 34 వేల 800 విలువచేసే వస్తువులు ఎలా వాడుతున్నారు. 2004లో రాజశేఖర్ సీఎం అయినప్పుడు జగన్ ఆస్తి ఎంతో కోటి 74 లక్షల రూపాయలు. 2009లో ఎన్నికల అఫిడవిట్లో 77 కోట్ల 39 లక్షల రూపాయలు, 2011లో ఎన్నికల అఫిడవిట్లో రూ.445 కోట్లు, 2019లో ఎన్నికల అఫిడవిట్లో రూ.510 కోట్లకు ఎలా వెళ్లింది అని ఆనం వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు.
తనకు ఇల్లు కూడా లేదని చెప్పుకునే పేద సీఎం జగన్మోహన్ రెడ్డి.. పులివెందుల ప్యాలెస్, హైదరాబాద్ లోటస్ పాండ్, కడప ప్యాలెస్, విశాఖ రుషికొండపై కట్టే ప్యాలెస్, బెంగుళూరు, చెన్నై, ముంబై, కలకత్తాలో ఉన్న ప్యాలెస్‌లు ఎవరివో చెప్పాలని డిమాండ్ ఆనం చేశారు. ఆ ప్యాలెస్‌లు తనవి కావని చెప్పి ఎవరైనా వాడుకోవచ్చని సీఎం చెప్పగలరా అని ప్రశ్నించారు. పదో తరగతి ఫెయిల్ ఆయిన జగన్మోహన్ రెడ్డికి లక్ష రూపాయలు విలువ చేసే పెన్నుతో ఏం రాస్తాడని ఎద్దేవా చేశారు.
2004 ఎన్నికల సమయంలో అఫిడవిట్లో కోటి 74లక్షల రూపాయలుగా ఆస్తి చూపిన జగన్మోహన్ రెడ్డి.. 2009లో రూ.77.39 కోట్ల ఆస్తిని ఎలా చూపించారని ప్రశ్నించారు. ఏవీ తనవి కాదని చెప్పే జగన్మోహన్ రెడ్డి, కుటుంబం కూడా తనది కాదని చెప్పి భారతికి అన్యాయం చేయవద్దని వేడుకుంటున్నా అని ఎద్దేవా చేశారు.
జగన్ ఈ మధ్య జబర్దస్త్ కామెడీ చేస్తున్నాడు….
లక్ష రూపాయల విలువైన చెప్పులు వేసుకుని తిరిగే రిచెస్ట్ సీఎం జగన్ రెడ్డి నేను పేదవాడిని అని సొల్లు కబుర్లు చెప్తున్నాడు#RichestCMJaganVsPoor #YuvaGalamPadayatra pic.twitter.com/SmvMg2PXrB
— Vikas Kanumuri (@KanumuriVikas) May 18, 2023
ఆంధ్రాలో ఒక నిరుపేద పరిస్తితి ఇది
కట్టుకున్న ప్యాలెస్‌లు = 5
తాగే మంచి నీళ్ళ బాటిల్ = 5500
కాళ్ళకు వేసుకునే చెప్పులు = 1.3 లక్షలుఅవాక్కాయ్యారా
అదేనండి ₹1/- జీతగాడు
ఎవడో స్క్రిప్టు రాసిస్తే తన గురించి మర్చిపోయి అనర్గళంగా అబద్ధాలు చెప్పే – సీఎం జగన్ పరిస్థితి…🤭😂 pic.twitter.com/7fMww4Huix— ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@Bezawada_Alludu) May 18, 2023
జగన్ రాజభోగాలు రూ.5 వేల రూపాయల వాటర్ బాటిల్ లక్ష రూపాయల పెన్ను..? లక్షన్నర రూపాయల చెప్పులు.. జీతం తీసుకోనని చెబుతున్న ఓ జగన్ రెడ్డీ.. ఇంతడబ్బు నీకెక్కడిది..?#RichestChiefMinisterJagan#AndhraPradesh pic.twitter.com/yLr0vgl1XU
— CBN ARMY VIZAG (@Cbnarmyvizag) May 17, 2023