సీఎం చంద్రబాబు శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. ఈ సమయంలో వైసీపీ హయాంలో అనేక విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నవారు..ఆయన ముందు ఘొల్లున కన్నీరు పెట్టుకున్నారు. “మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీ నాయకుల వేధింపులు ఆగడం లేదు“ అని కొందరు వ్యాఖ్యానించారు. దీంతో సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు. విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబుకు ఫోన్ చేసి.. “24 గంటల్లో సమస్యలు పరిష్కరించండి.. లేకపోతే.. నేనే రంగంలోకి దిగుతా“ అని హెచ్చరిం చారు.
ఏంటా ఫిర్యాదులు..
+ జగన్ ప్రభుత్వంలో తాము తీవ్ర ఇబ్బందులు పడ్డామని విజయవాడ వన్ టౌన్‌కు చెందిన అక్కల రోజా, ఆమె భర్త, భారత సైన్యంలో జవాన్ గా చేసిన జ్ఞానానంద్ సీఎం చంద్రబాబు దగ్గర కంటతడి పెట్టుకున్నారు. బిల్డింగ్ 3వ అంతస్తుకు అనుమతి ఇవ్వకుండా ఐదేళ్ల పాటు తిప్పి ఇబ్బందులకు గురి చేశారని జవాన్ దంపతులు మొరపెట్టుకున్నారు. వెంటనే సీపీ రాజశేఖర్‌బాబుకు ఫోన్ చేసిన చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు. ఇన్నాళ్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
+ కృష్ణా అనే వ్యక్తి తమ నుంచి ఇల్లు కొనుగోలు చేసి రూ.10 లక్షల మేర ఇవ్వకుండా బెదిరించారని, అప్పులపాలై రోడ్డుపాలయ్యామని విజయవాడకు చెందిన మరో బాధిత కుటుంబం పేర్కొంది. సమస్యను పరిష్కరిస్తామని వారికి సీఎం హామీ ఇచ్చారు.
+ కూతురి హత్య కేసులో న్యాయం చేయాలని ఓ మహిళ విన్నవించు కోగా… పొలంలోకి దిగితే వైసీపీ నేతలు చంపేస్తామని బెదిరిస్తున్న రని బాధితులు సమస్యను విన్న వించుకున్నారు. గత ప్రభుత్వంలో అకారణంగా తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలని పలువురు వికలాంగులు కోరారు. అనారోగ్యం, ఇతర సమస్యలతో బాధపడేవారికి సీఎం ఆర్థికసాయం చేశారు. అంతకముందు పార్టీ నేతలతో సభ్యత్వ నమోదుపై సమీక్షించారు.
+ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న తన కూతురు 2022 జూలై 4న కాలేజీకి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని, అదే కాలనీలో ఉంటున్న ఆటో డ్రైవర్ ఆనంద్ అనే యువకుడు ప్రేమపేరుతో వంచించాడని గుంటూరు జిల్లా, గుజ్జనగుళ్లకు చెందిన నిశంకర శంకరలీల అనే మహిళ సీఎం వద్ద మొరపెట్టుకున్నారు. ఈ కేసులో ఎంతటి వాళ్లున్నా వదిలిపెట్టమని, తప్పకుండా న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.
+ పొలంలోకి అడుగుపెడితే చంపేస్తా మని వైసీపీ నేతలు బెదిరిస్తున్నార ని రాజమండ్రి రూరల్ మండలం, హుకుంపేటకు చెందిన బొప్పన సురేష్ బాబు సీఎంకు ఫిర్యాదు చేశారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ య్య చౌదరికి ఫోన్ చేసి, ఏం చేస్తున్నారని ప్రశ్నించడం గమనార్హం.