సీఎం చంద్రబాబు చాలా మాటకారి. ఏ విషయాన్నయినా.. ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకునే ప్ర యత్నం చేస్తారు. వివాదాల నుంచి కూడా అవకాశాలు వెతుక్కునే నాయకుడిగా బాబు పేరు తెచ్చుకు న్నారు. గతంలో తన అరెస్టును.. సమాజం అరెస్టుగా చూపించి.. ఎన్నికల్లో సక్సెస్ అయ్యారు. ఐటీ ఉద్యోగులను కదనరంగం వైపు మళ్లించారు. ఇక, పెరిగిన ధరలను, టీడీపీ నేతలపై దాడులను కూడా పార్టీకి సానుకూలంగా మలచడంలోనూ సక్సెస్ అయ్యారు.
మరీముఖ్యంగా కూటమి కట్టడంలో చంద్రబాబు వ్యూహం మరోస్టెప్ అనే చెప్పాలి. ఐదేళ్ల కిందట తిట్టిన పార్టీని అక్కున చేర్చుకున్న చంద్రబాబు.. పొత్తు పెట్టుకుని.. అధికారం చేపట్టారు. ఇలా.. ఏ విషయాన్న యినా.. తనకు, ప్రభుత్వానికి కూడా అనుకూలంగా మలుచుకునే శక్తిసామర్థ్యాలు ఉన్నచంద్రబాబు.. తాజాగా ఒక విషయంలో మాత్రం తర్జన భర్జన పడుతున్నారు. మనసులోఉన్న చెప్పలేక.. అలాగని దాచుకోనూ లేక ఆయన ఇబ్బందిపడుతున్నారని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
ప్రస్తుతంరాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని చంద్రబాబు చెబుతున్నారు. గత వైసీపీ ప్రభు త్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని.. దీనిని తీర్చేందుకు.. అవకాశం కనిపించడం లేద ని.. పైగా వడ్డీలు కట్టేందుకు మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోందని.. తాజాగా నెల్లూరు జిల్లాకందుకూరులో చంద్రబాబు ప్రకటించారు. ప్రజలు ఈ సమస్యను అర్ధం చేసుకోవాలని కూడా ఆయన సూచించారు. కట్ చేస్తే.. ఈ వ్యాఖ్యల వెనుక రెండు రీజన్లు ఉన్నాయి. కానీ, వాటిని బయటకు చెప్పలేక చంద్రబాబు సతమతం అవుతున్నాయి.
1) రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడింది. మార్చి నాటికి .. పింఛన్లు, వేతనాలు ఇచ్చేందుకు ఇప్పుడు సొమ్ములు లేవు. ఇటీవల రిజిస్ట్రేషన్ ధరలు పెరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయింది. దీంతో రెవెన్యూ తగ్గిపోయింది. మరో వైపు.. మద్యంపై ఆదాయం కూడా అంతంత మాత్రంగానేఉంది. ఇటీవలే మద్యం వ్యాపారులకు మార్జిన్ పెంచాల్సి వచ్చింది. ఉచిత ఇసుక కూడా నష్టాల బాట నే నడుస్తోంది.
దీంతో అప్పులు చేయకపోతే.. మార్చిలో కష్టాలు తప్పవు. కానీ, ఈ విషయాన్ని చంద్రబాబు బయటకు చెప్పలేక పోతున్నారు. 2) ఉచిత హామీల అమలుపై కొంత వెసులు బాటు. ప్రస్తుతం ఉచితాలను అమలు చేయాలని ఉన్నా.. ఖజానా ఖాళీగా ఉన్న నేపథ్యంలో వాటిని అమలు చేసే పరిస్థితి కనిపించడంలేదు. ఈ విషయాన్ని నేరుగా చెబితే.. విపక్షాలకు చాన్స్ ఇచ్చినట్టు అవుతందని భావిస్తున్నారు. అందుకే ఉన్నది చెప్పలేక.. చంద్రబాబు `అర్ధం చేసుకోరూ..` అని వ్యాఖ్యానిస్తున్నారు.