ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బర్త్డే నేడు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి.. ఒక్క ఛాన్స్ అంటూ చిన్న వయసులోనే సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఆ ఒక్క ఛాన్సే జగన్ ను ప్రజలకు దూరం చేసింది. నవ్యాంధ్రలో రెండోసారి జరిగిన ఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీతో గ్రాండ్ విక్టరీని సాధించిన జగన్.. గత ఐదేళ్లు తన అధర్మ, అరాచక పాలనతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు.
ఫలితంగా ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయారు. వైనాట్ 175 అన్న జగన్.. చివరకు 11 సీట్లకే పరిమితం అయ్యారు. అధికారం కోల్పోయినా, కీలక నాయకులంతా గుడ్ బై చెప్పేస్తున్నా జగన్ మాత్రం పార్టీని బలోపేతం చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. నేడు(డిసెంబర్ 21) జగన్ 52 వ వసంతంలోకి అడుగుపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అభిమానులు, కార్యకర్తలు జగన్ బర్త్డే వేడుకులను ఘనంగా జరుపుకుంటున్నారు.
మరోవైపు సోషల్ మీడియాలో జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జగన్ కు బర్త్డే విషెస్ చెప్పారు. `వైఎస్ జగన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు పొందాలని ఆకాంక్షించారు` అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. తాము ప్రత్యర్థులమే కానీ శత్రువులం కాదు అని నిరూపించి చంద్రబాబు తన వ్యక్తిత్వం చాటుకున్నారు.
Warm birthday greetings to @ysjagan Garu. May he be blessed with good health and long life.
— N Chandrababu Naidu (@ncbn) December 21, 2024