ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు కుదిపేసిన సంగతి తెలిసిందే. అత్యధిక వర్షపాతం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైతన్నలకు భారీగా పంట నష్టం ఏర్పడింది. అయితే తాజాగా సీఎం చంద్రబాబు నుంచి వరద బాధితులకు తీపి కబురు వచ్చింది.
ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వరద బాధితులకు తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, పప్పు, నూనె, బంగాళదుంపలు, ఉల్లిపాయలతో పాటు రూ. 3000 ఆర్థిక సాయం చేస్తామని చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.
అలాగే జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లి వరద బాధితులను పరామర్శించాలని చంద్రబాబు సూచించారు. వరదల వల్ల ఏర్పడిన నష్టాన్ని అంచనా వేసి వివరాలు నమోదు చేయాలని.. మళ్లీ రైతులు కోలుకోవడానికి ఏం చేయాలనే అంశంపై ఆలోచించి తెలిపాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.