అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నిన్నటి వేళ ప్రసంగించారు. భారతీయ అమెరికన్ల సదస్సులో సీజే కొన్ని ఆసక్తిదాయక వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా వివిధ పార్టీలు వాటి నడవడి గురించి కూడా వివరిస్తూనే,. వారిని ఉద్దేశించి కొన్ని చురకలు అంటించారు. మనం విసిరేయాల్సింది రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించే వ్యక్తులను తప్పితే రాజ్యాంగాన్ని కాదు.
ప్రతి అయిదేళ్లకోసారి పాలకుల పనితీరుపై తీర్పు ఇచ్చే అధికారాన్ని ప్రజలకు భారత రాజ్యాంగం ఇచ్చింది. భారతీయ పౌరులు ఇప్పటివరకూ తమ బాధ్యతను అద్భుతంగా నిర్వహించారు అంటూ కొనియాడారు. మేం రాజ్యాంగానికే విధేయులం.. రాజ్యాంగాన్ని శిలాశాసనంగా కాకుండా చూడకూడదు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వ్యవస్థలూ మారాలి అని అన్నారాయన. చాలా మందిలో రాజ్యాంగంపై అవగాహన లేమి ఉందని అన్నారు.
ఇదే సందర్భంలో భాషకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు వారంతా తెలుగులోనే మాట్లాడాలి.. బిడ్డలకు తెలుగు ప్రథమ భాషగా చదువు చెప్పించాలి. ఎదుగుతున్న పిల్లలతో ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలి.. తెలుగులో ఉత్తరాలు రాసే సంప్రదాయాన్ని కొనసాగించాలి.
తెలుగులో మాట్లాడేందుకు సిగ్గు పడాల్సిన అవసరమే లేదు. శతక సాహిత్య, భాషా చరిత్రను యువతకు చెప్పాలి. పిల్లలు మాట్లాడే తెలుగును హేళన చేయకూడదు. వారిని తెలుగులోనే మాట్లాడే విధంగా ప్రోత్సహించాలి..భాష లేకపోతే మన సంస్కృతి, చరిత్ర లేదు అన్న విషయాన్ని గుర్తించాలి. జాతే అంతరించి పోయే ప్రమాదాన్ని గుర్తించాలి..అంటూ సభికులకు సూచనలు అందించారు.
ఇదే సందర్భంలో మహిళా సాధికారత గురించి కూడామాట్లాడారు. ఐటీ విప్లవం ప్రారంభం కాకమునుపే ఎంతో భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా తమ సత్తాను రుజువు చేసుకున్నారన్నారు.
అనంతరం శాన్ ఫ్రాన్సిస్కోలోని భారతీయ సంఘాలు సీజే దంపతులను సత్కరించాయి. కార్యక్రమంలో భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా, భారతీయ అమెరికన్ల సంఘం అధ్యక్షులు కోమటి జయరాం, భారత కాన్సూల్ జనరల్ నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
"The party in power believes that every governmental action is entitled to judicial endorsement": Chief Justice NV Ramana https://t.co/4J6ywfhsQv pic.twitter.com/eLyPht3zv7
— NDTV (@ndtv) July 3, 2022
CJI NV Ramana said the political party in power believes that every governmental action is entitled to judicial endorsement, and the opposition expects the judiciary to advance their political positions. However, it is only the judiciary that is answerable to the Constitution. pic.twitter.com/HU2IXynCvj
— BuzzPedia (@BuzzPedia_in) July 3, 2022
"Parties Wrongly Believe…": Chief Justice NV Ramana On Judiciary https://t.co/4J6ywfhsQv pic.twitter.com/NPDLtObk6H
— NDTV (@ndtv) July 3, 2022