మెగా కుటుంబాన్ని రోడ్డున పడేయడంలో నాగబాబు ఎపుడూ ముందుంటాడు.
అతను మంచి చేద్దామనుకుంటాడు కానీ అతను చేసే పనులన్న మెగా క్యాంపునకు డ్యామేజ్ చేసే విధంగానే ఉంటాయి.
వాస్తవానికి మా ఎన్నికలపుడు నాగబాబు మాటల వల్లనే ప్రకాష్ రాజ్ కి రావాల్సిన ఓట్లు కూడా పోయాయి.
అంతేగాకుండా స్థిరత్వం లేకుండా ఉండటంతో పాటు ఎపుడూ ఎవరిపైనో ద్వేషం కురిపించడం వల్ల మెల్లమెల్లగా మెగా హీరోలను అందరికీ దూరం చేస్తున్నారు నాగబాబు.
నాగబాబు భావవ్యక్తీకరణ తీరు వల్ల ప్రతిసారీ ఆ కుటుంబానికి డ్యామేజ్ జరగడం, తరవాత మళ్లీ అతనే వచ్చి దానిని కవర్ చేసుకోవడం సర్వసాధారణం అవుతోంది.
మా ఎన్నికల్లో నాగబాబు అందరినీ విమర్శించాడు. సీనియర్లను అవమానించాడు. ప్రకాష్ రాజ్ కి భారీ మద్దతు తెలుపుతున్నట్టు అతను తీరు ఉంది. నిజానికి ప్రకాష్ రాజ్ ను నిలబెట్టిందే మెగా కుటుంబం. కానీ విచిత్రం ఏంటంటే మెగా కుటుంబంలో చాలా మంది ఓటే వేయలేదు. ఇలా వాళ్లలో వాళ్లకే ఇన్ని గొడవలు ఉంటే నాగబాబు బయటకు రావడం వల్ల అవన్నీ అందరికీ తెలిసిపోతున్నాయి.
మా ఎన్నికల సమయంలో మెగా బ్రదర్ నాగబాబు ప్రకాష్ రాజ్ ప్యానెల్ ప్యానల్ తరఫున చేసిన రచ్చ వల్ల … చిరంజీవి పెదరాయుడుగా ఉండాలని ఇవన్నీ చేస్తున్నాడని ఓ కొత్త చర్చ మొదలైంది. కరోనా సమయంలో చిరంజీవి వ్యవహరించిన తీరు దీనికి ఒక కారణం అయితే, ఎన్నికల సమయంలో చేసిన హడావుడి ఇంకో కారణం. సైలెంటుగా ఎన్నికల రంగంలో ఉంటే ఈ చర్చ వచ్చేదే కాదు, చివరకు మంచు విష్ణు గెలవడంతో ఇపుడు భారీగా కవర్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
తన అన్న చిరంజీవి గురించి నడుస్తున్న చర్చపై నాగబాబు తాజాగా మీడియాతో స్పందించారు. ‘‘మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమ పెద్ద దిక్కు కావాలని ఎన్నడూ కోరుకోలేదు. పరిశ్రమకు చెందిన వ్యక్తులు తన వద్దకు వచ్చినప్పుడల్లా, చిరంజీవి వారికి సాధ్యమైన రీతిలో సహాయం చేసేవారు. అతను ప్రజల సమస్యల పట్ల ఎల్లప్పుడూ సున్నితంగా ఉంటారు. అంతే కానీ పెదరాయుడులా సింహాసనంపై కూర్చుని తీర్పులు చెప్పడానికి అతను ఎప్పుడూ ఇష్టపడడు” అని నాగబాబు కవర్ చేశారు.
ఇదే విషయం ఎన్నికల ముందు కూడా చెప్పి ఉంటే ఉపయోగం ఉండేదేమో నాగబాబు.