ఏపీ డీజీపీ అత్యుత్సాహం ఆయననే అభాసుపాలు చేసింది.
ఏపీ ప్రజలు అందరికీ తెలిసిన విషయంలోను అధికార పార్టీని కవర్ చేయబోయి ఆయన అడ్డంగా బుక్కయ్యారు.
అంతేకాదు, జగన్ ని కూడా మరోసారి డ్యామేజ్ చేసే అవకాశాన్ని ప్రతిపక్షాలకు ఇచ్చారు.
అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాలపై పదేపదే జగన్ సర్కారు కేసులు పెడుతున్న సంగతి తెలిసిందే.
ఇక పోలీసు కేసులతో రూల్ ఆఫ్ లాను కూడా మరిచి కేసులు పెట్టి కోర్టు మెట్లు ఎక్కారు డీజీపీ.
అసలు దిశ చట్టం అనేదే లేకపోయినా ఉందని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు.
చివరకు గుంటూరు రమ్య కేసులో లోకేష్ విసిరిన 21 రోజుల సవాల్ తో దిశ చట్టం లేదని ప్రభుత్వం ఒప్పుకోక తప్పలేదు.
ఇక ఈరోజు 4 అవార్డులు రావడంతో ఇదే సందని ఏపీ పోలీసుల గురించి గొప్పలు చెప్పబోయారు డీజీపీ
అంతవరకు ఆపితే బాగుండు… ఏపీలో ఎక్కువ కేసులు ఉన్న వారిని ప్రస్తావించి బుక్కయిపోయారు.
చింతమనేనిని పేరు పెట్టి ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఎక్కువ కేసులున్న నేత అంటూ చెప్పుకొచ్చారు.
దీన్నే ప్రతిపక్షాలు ఆయుధంగా మలుచుకున్నాయి. ఇక డీజీపీకి రిటార్ట్ ఇస్తూ చింతమనేని మీడియా సమావేశం పెట్టి డీజీపీని ఓ రేంజ్ లో ఆడుకున్నారు. ముందు మీ బాసుపై ఎన్నికేసులున్నాయో తెలుసుకో డీజీపీ అంటూ సెటైర్లు వేశారు.