ఉత్తర అమెరికా తెలుగు సంఘం (‘తానా’) ప్రతి రెండేళ్ళకోసారి నిర్వహించే మహాసభలు ఈసారి జూలై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్ లో చేస్తాకి ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే .
‘తానా’ 24వ ద్వై వార్షిక మహాసభలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ‘తానా’ కాన్ఫరెన్స్ నాయకులు కలిసి మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ‘తానా’ చేస్తున్న సేవా కార్యక్రమాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎన్నారై గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ, బిజెపి అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణం, ‘తానా’ మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి, ‘తానా’ కాన్ఫరెన్స్ చైర్మన్ నాదెళ్ళ గంగాధర్, బే ఏరియా ‘తానా’ నాయకులు శశి దొప్పలపూడి, నార్త్ కరోలినా ‘తానా’ నాయకులు చందు గొర్రెపాటి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంట్ర, శ్రీనివాస్ నాదెళ్ళ, గిరి వల్లభనేని తదితరులు పాల్గొన్నారు.
అమరావతి పర్యటన లోనే ఉన్న ప్రస్తుత ‘తానా’ ప్రెసిడెంట్ నిరంజన్ శృంగవరపు లేకుండా ముఖ్యమంత్రిని ఆహ్వానించడం, చంద్రబాబుని అవమానించడం అని ‘టిడిపి’ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.
