కుప్పంలో గెలిచి తీరాలనేది వైసీపీ వ్యూహం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు ను ఓడించాలనేది ఆయనను ఓడించడం ద్వారా వైసీపీ దూకుడును ప్రదర్శించాలనేది వైసీపీ అధిష్టానం నిర్ణయం. అందుకే.. 2020 నుంచి కూడా బాబు నియోజకవర్గం కుప్పంపై ప్రత్యేక దృష్టిపెట్టి.. అనేక కార్యక్ర మాలకు శ్రీకారం చుట్టింది. అయితే.. వీటిలో ప్రధానంగా కుప్పాన్నిమినీ మునిసిపాలిటీగా తీర్చి దిద్దడం.
ఇవన్నీ.. ఒక ఎత్తయితే.. నాయకులను అదుపులో ఉంచడం.. వారిపై కేసులు నమోదు చేయడం.. వంటివి కూడా వైసీపీ వ్యూహంలో భాగమేనని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇక, ఇప్పుడు ఇక్కడ పర్యటించిన చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అసలు గెలుపు కాదు.. ఏకంగా లక్ష ఓట్ల మెజారిటీ దక్కించుకునే దిశగా అడుగులు వేయాలని ఆయన పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
వచ్చే ఎన్నికలకు సంబంధించి ప్రతి ఒక్క కార్యకర్త చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని, మినిమేని ఫెస్టోతో పాటు.. ఇంటింటికీ తిరగాలని, ప్రతి గడపను స్పృశించాలని.. ప్రతి ఒక్కరి ఆవేదనను వినాలని కూడా తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేవలం గెలుపు మాత్రమే కాదని.. కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ వచ్చే దిశగా పార్టీ నాయకులు అడుగులు వేయాలన్నారు. ఇదేసమయంలో వైసీపీ అరాచకాలపైనా ప్రచారం చేయాలని చంద్రబాబు చెప్పారు.
టీడీపీ-జనసేనలు కలిసి విడుదల చేసిన మినీ మేనిఫెస్టోలోని కీలకమైన పథకాల విషయంలో మరింతగా వివరించాలని చంద్రబాబు సూచించారు. మరో నాలుగు మాసాలు అలుపెరగకుండా.. కష్టిస్తే.. ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా.. చంద్రబాబు తేల్చి చెప్పారు.