కడప లో చంద్రబాబు సమక్షంలో కడప జిల్లా జమ్మలమడుగు నేతలు, మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు.
వరదల్లో నిండా మునిగిపోయిన రాయలసీమ జిల్లాలో మూడు రోజులుగా గ్రామగ్రామాన తిరుగుతున్న చంద్రబాబు ప్రజల వేదన చూసి చలించిపోయారు.
ముఖ్యమంత్రి విందులు చేసుకుంటే, అధికారులు డిన్నర్ చేసుకున్నారు ప్రజల్ని ఏటికి వదిలేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
జగన్ కి అనుభవంతో సహా అన్నీ తక్కువే, అహంభావం ఒకటే ఎక్కువ. ప్రజలు నరకయాతన అనుభవిస్తుంటే అసెంబ్లీలో పొగిడించుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు.
ఎంత పాపం చేసుకుంటే ఇలాంటి ముఖ్యమంత్రి మనకు వచ్చుంటాడు. దేశంలో అంతటా అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే ఒక్క ఏపీలో మాత్రం దానికి అడ్రస్ లేదు అని చంద్రబాబు ఆవేదన చెందారు.
ఇక పార్టీలో చేరికల సందర్భంగా కష్టకాలంలో ఎవరైతే పార్టీని అంటిపెట్టుకుని ఉంటారో వారిని గుర్తించే ప్రత్యేక మెకానిజాన్ని పార్టీలో అభివృద్ధి చేసినట్లు చంద్రబాబు చెప్పారు. ఏ నేత రెకమెండేషన్లు సిఫారసులు లేకుండా పనిచేసిన ప్రతి నేతకు, కార్యకర్తకు ఇకపై తగిన గుర్తింపు గౌరవం దొరుకుతుందని చంద్రబాబు చెప్పారు.
రాయలసీమ వరదలు
ప్రజల కష్టాలు
వైసీపీ నేతలు వరదలకు ఎలా కారణమయ్యారు
స్వర్ణముఖి ఒడ్డున ఏం జరిగింది?
అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు ఎత్తకపోవడం వల్ల వైసీపీకి కలిగిన లాభం, ప్రజలకు కలిగిన నష్టం
వంటి విషయాలను చంద్రబాబు ఈ వీడియోలో విపులంగా వివరించారు.
మస్ట్ వాచ్ వీడియో.
దీనిని 1.5 x స్పీడ్ తో వినండి