లీడర్ షిప్ అంటే సామాన్య జనాలకు డబ్బులు పంచి అయ్యా నువ్వు దేవుడు అనిపించుకోవడం కాదు
లీడర్ అంటే సామాన్యుల పిల్లల భవిష్యత్తు అలా సామాన్యంగా మిగిలిపోకూడదని, ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేయడం.
కానీ ఇది పబ్లిసిటీ కాలం. మనం చేసింది చెప్పుకుని తీరాలి. అలాగే ఎదుటి వారు చెప్పే అబద్ధాలను గట్టిగా తిప్పికొట్టాలి. ఈ రెండింట్లో ఏది ఫెయిలైనా మొదటికే మోసం.
2014 – 19 మధ్య చంద్రబాబు పాలనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిన అసత్యాలను తిప్పికొట్టడంలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా విఫలమైంది. అందుకే ఓటమి పాలైంది.
చంద్రబాబు ఎందుకీ పనికిరాని వాడు అంటూ, కులం చూస్తాడు అంటూ అనేక రకాల ప్రచారాలు చేశారు. జగన్ చెబితే ఎవరు వింటారులే అని చంద్రబాబు ఓవర్ కాన్ఫిడెన్స్ తో వాటిని పట్టించుకోలేదు.
దాని ఫలితమే ఈరోజు అరగంట మంత్రులతో కూడా బూతులు తిట్టించుకుంటున్నారు చంద్రబాబు.
రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే పక్క రాష్ట్రాల్లో మాత్రం చంద్రబాబు క్రేజు మరోలా ఉంది.
మీరు ఎవరి ప్రసంగం వినాలని కోరుకుంటున్నారు అని ఐఏఎస్ ట్రైనీలను అడిగితే చంద్రబాబు అన్నారు.
పరిపాలనలో మీకు స్ఫూర్తిగా నిలిచే నాయకుడు ఎవరు అంటూ తమిళనాడు సీఎం స్టాలిన్… చంద్రబాబు పేరు చెప్పాడు
తాజాగా నువ్వు దేని మీద పీహెచ్డీ చేస్తావు అని ఓ రాజస్థాన్ విద్యార్థిని అడిగితే అతను ‘‘నారా చంద్రబాబునాయుడు – ఎ రోల్ మోడల్‘‘ అంశంపై పీహెచ్డీ చేస్తాను అన్నాడట. ఆ పీహెచ్డీని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి ఇపుడు డాక్టరేట్ పొందిన ఆ యువకుడి పేరు సొంగ దేవదాస్. అతనికి గైడ్ చేసిన ప్రొఫెసర్ డాక్టర్ గురుదత్ స్వామి.