చంద్రబాబు ఈసారి ఓ నిర్మాణాత్మకమైన ఆలోచన చేశారు.
అధికారంలో లేకపోయినా తన పరిధిలో కోవిడ్ బాధితులకు అండగా నిలుస్తున్నారు.
పార్టీ తరఫున ’’ హోప్ హెల్ప్ ‘‘ అనే కార్యక్రమం పెట్టి ఎవరు సాయం అడిగినా వారికి అండగా నిలుస్తున్నారు.
#sostdp అని ట్యాగ్ చేసిన ప్రతిఒక్కరు తక్షణ సాయం అందుకున్నారు.
తాజాగా తన నియోజకవర్గ ప్రజలకు కోవిడ్ ఇబ్బందే అవకూడదని చంద్రబాబు డిసైడ్ అయ్యారు.
అందుకు ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు రెండింటికి పరిష్కారం చూపడానికి కోటి రూపాయల తన సొంత డబ్బు కేటాయించారు.
కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.35 లక్షల సొంత నిధులతో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించనున్నారు.
ఆసుపత్రి మొదటి అంతస్తులో ఆక్సిజన్ సరఫరాను గ్రౌండ్ ఫ్లోర్కి అందేలా మరమ్మతులు వెంటనే చేయించాలని, అంతేకాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా జరుగుతున్న టెలి మెడిసిన్, ఆహార పంపిణీ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా నిర్వహించాలని చంద్రబాబు సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రికి కావాల్సిన పల్స్ ఆక్సీమీటర్లను కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా శనివారం అందిస్తామని ఆయన తెలిపారు.
నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉన్న 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కావలసిన మెడిసిన్ వివరాలు తెలుసుకొని, వాటిని వెంటనే పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 200 పడకలు, ఓకేషనల్ జూనియర్ కళాశాల నూతన భవనంలో 200 పడకలు చొప్పున ఐసోలేషన్ కోసం ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. దీని గురించి వెంటనే జిల్లా కలెక్టర్కు లేఖ రాస్తానని తెలిపారు.
కుప్పం ప్రజల శ్రేయస్సు కోసం ఈ పనులన్నీ చేయాలనుకుంటున్నానని… దీనికి దాదాపు రూ.కోటిని వరకు ఖర్చవుతుందని, ఆ మొత్తాన్ని తానే స్వయంగా అందిస్తానని, యుద్ధప్రాధిపతికన పనులన్నీ ప్రారంభించాలని నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.