ఏపీ విపక్షనేత.. టీడీపీ అధినేత చంద్రబాబు ను మరోసారి టార్గెట్ చేసింది జగన్ సర్కారు. సాధారణంగా వీకెండ్ ఆరంభమైన శుక్రవారం కొత్త సినిమాలు విడుదల అవుతుంటాయి. అందుకు భిన్నంగా ఏపీ రాజకీయాల్లో వీకెండ్ వస్తే చాలు.. ఏదో ఒక సంచలన రాజకీయ పరిణామం చోటు చేసుకుంటూ ఉంటుంది. తాజాగా అలాంటిదే ఒకటి జరిగింది. అయితే.. ఆ షాక్ విపక్ష నేత చంద్రబాబుకు తగలటం సంచలనంగా మారింది.
కరట్టపై ఆయన నివాసం ఉంటున్న గెస్టుహౌస్ నను అటాచ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్రిమినల్ లా అమెండ్ మెంట్ 1944 చట్టం ప్రకారం అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. ఏపీ సీఎంగా ఉన్న వేళలో చంద్రబాబు.. మంత్రిగా ఉన్న నారాయణ తమ పదవుల్ని దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణపై అధికారులు చేపట్టటం తెలిసిందే. ఇందులో భాగంగా అధికారులు చంద్రబాబు నివాసం ఉంటున్న గెస్ట్ హౌస్ ను అటాచ్ చేశారు. నిబంధనల్ని ఉల్లంఘించారన్న విషయం విచారణలో తేలినట్లుగా పేర్కొన్నారు.
సీఆర్డీయే మాస్టర్ ప్లాన్.. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్లలో అవకతవకలకు పాల్పడి.. అందుకు బదులుగా కరకట్టపై లింగమనేని గెస్ట్ హౌస్ ను పొందారన్న అభియోగాలు ఉన్నాయి. ఇదే అంశం విచారణలో తేలినట్లు పేర్కొంటూ గెస్టుహౌస్ ను అటాచ్ చేశారు. విచారణ జరిపిన సీఐడీ అధికారులు.. రాష్ట్ర ప్రభుత్వ చట్టం ప్రకారంచంద్రబాబు గెస్టు హౌస్ ను అటాచ్ చేశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని స్థానిక న్యాయమూర్తికి అందించారు. లింగమనేని రమేశ్ బినామీగా చంద్రబాబు భారీగా ఆస్తులు కూడబెట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. మరి.. దీనిపై చంద్రబాబు ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.
ఆ గెస్ట్ హౌస్ ఓనర్ లింగమనేని
Btw, ఆ గెస్ట్ హౌస్ కట్టేసమయానికి CRDA లేదు
ఇచ్చిన అనుమతులు 2007-08 లో ఇచ్చారు
తర్వాత ఇంకొన్ని
ఇన్ని మాటలు అనిపించుకుంటూ అక్కడే ఉండడం దేనికి ? @ncbn https://t.co/hw1jgm40Q9 pic.twitter.com/ZUaj5kW760— Eclector (@eclector1419857) May 14, 2023