టీడీపీ అధికారంలోకి రావడం.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం.. జరిగిపోగానే.. ఆయన తొలి సంతకం దేనిపై పెడతారు? దీనిపై తెలుగుదేశం పార్టీ సంచలన ప్రకటన చేసింది.
ఇప్పటివరకు గతంలో అనేక ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ఏ ఇళ్లకు పట్టాలు లేవు. ఆ మాటకు వస్తే ఊళ్లలో ఇళ్లకు పట్టాలు ఎవరికీ ఉండవు. జగన్ సర్కారు దివాలా తీయడంతో దీనిని కూడా ఆదాయంగా మలచుకుందాం అని వాటిపై కన్నేశాడు.
ఇప్పుడు ఆయా ఇళ్లకు తీసుకున్నరుణాలపై ఒన్ టైం సెటిల్మెంట్ పథకం అంటూ.. వైసీపీ ప్రభుత్వం డబ్బులు వసూలు చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అసలు ఆ ఇళ్లపై రుణాలున్నట్టే ఎవరికీ తెలియదు. ఎందుకంటే ప్రభుత్వమే ఆ రుణాలు చెల్లిస్తుంటుంది. కానీ నేడు జగన్ పరిపాలన దివాలా తీయడంతో ఆ రుణం కట్టలేక వన్ టైం సెటిల్మెంట్ కింద ఆ మొత్తం భారాన్ని పేదలపై వేయడానికి జగన్ సర్కారు ప్రయత్నిస్తోంది.
పైగా మీ ఇంటికి జగన్ సర్కారు శాశ్వత హక్కు కల్పిస్తుంది అంటూ జగన్ పథకం అనే ట్యాగ్ తగిలించడం మహా మోసం. ఈ పథకం కింద పేదల నుంచి రెండు నెలల్లోనే 4000 కోట్లు రాబట్టాలని జగన్ సర్కారు. నిర్ణయించుకుంది.
జగన్ అనుకున్నది ఒకటి, అయినది ఇంకోటి. ఈ డబ్బులు కట్టండి ఇల్లు మీరుపై రాసి పట్టా ఇస్తాం అని ప్రభుత్వం వలంటీర్ల ద్వారా అడుగుతుంటే… తామెందుకు కట్టాలని ప్రజల నుంచి తిరుగుబాటు వస్తోంది.
ఎంత దారుణం అంటే ప్రభుత్వం కట్టాల్సిన సొమ్మును పేదలు కట్టాలట… ఇది నూతన పథకం అట. ఇల్లుకు పట్టా వస్తే దానిపై మళ్లీ బ్యాంకులో లోనుకు వాడుకోవచ్చట. ఇది కొత్త పథకమట. ఎంత మోసం గురు ఇది.
జనం మాత్రం జగన్ కి రిటార్ట్ ఇస్తున్నారు. మేం కట్టనూ వద్దు.. జగన్ బొమ్మ పెట్టనూ వద్దని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు మీరే కట్టుకోండి. మేం కట్టం అని తేల్చి చెబుతున్నారు. మాకు పట్టాలొద్దు అని మొహం మీదే చెప్పేస్తున్నారు.
ప్రజల్లో ఈ దోపిడీపై తిరుగుబాటు రావడంతో జగన్ సర్కారు షాక్ తిన్నది. దీనిపై తెలుగుదేశం సంచలన నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు అధికారంలోకి రాగానే పేదలకు బహుళ ప్రయోజనం కలిగించే ఇంటి హక్కు పట్టాను అందరికీ ఉచితంగా ఇచ్చేలా మొదటి సంతకం చేస్తారని తెలుగుదేశం ప్రకటించింది.
తాజాగా చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి, టీడీపీ నేత.. లోకేష్ రియాక్ట్ అయ్యారు. పేదలు సర్కారుకు రూపాయి కట్టొద్దు. ఆయా సొమ్ములు ఎవరూ ప్రభుత్వానికి చెల్లించవద్దని సూచించారు. మన ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా మీ పట్టాలు మీకిచ్చేస్తాం అని లోకేష్ స్పష్టం చేశారు.
ఈ క్రమంలో వైసీపీ సర్కారుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. పంచాయతీ నిధులను కూడా ప్రభుత్వం మింగేస్తోందని దుయ్యబట్టారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకువచ్చిన వన్ టైం సెటిల్మెంట్ స్కీం ఒక దగా అని… ఎవరూ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు.
కొసమెరుపు ఏంటంటే… ఆ ఇళ్లకు ప్రభుత్వం సరిపడనంత డబ్బు ఇవ్వకపోయినా ప్రజలే తమ సొంత డబ్బులు వేసుుకుని వాటిని కట్టుకున్నారు. ఇపుడు అవి ప్రభుత్వానివి మీరు డబ్బు కట్టాలి అంటే ప్రజలు ఘోరంగా తిరగబడుతున్నారు.