మొన్న ఉండవల్లి
నేడు చంద్రబాబు
ఇద్దరు చెబుతున్నది ఒకటే..
మద్యం షాపుల్లో ప్రభుత్వం సంపాదించే డబ్బుల్లో గవర్నమెంటుకంటే జగన్ ఎక్కువ సంపాదిస్తున్నారని అంటున్నారు.
తాజాగా కుప్పం పర్యటనలో చంద్రబాబు ఈ ఆరోపణలు చేశారు. మందు కొని తాగే పేదలను జగన్ లూటీ చేస్తున్నారని ఆరోపించారు.
పాన్ షాపుల్లో కూడా ఫోన్ పె వాడుతుంటే మద్యం షాపుల్లో మాత్రం జగన్ ఎందుకు క్యాష్ మాత్రమే అడుగుతున్నారో జనం అర్థం చేసుకోవాలన్నారు.
అనుమానమే లేదు. 15 రూపాయల మందును 200 రూపాయలకు అమ్మితే ట్యాక్సుతో 50 రూపాయలు గవర్నమెంటుకు మిగతా డబ్బులు జగన్ జేబులోకి వెళ్తున్నాయని చంద్రబాబు ఆరోపించారు. నాసిరకం బ్రాండ్లను అధిక ధరలకు విక్రయిస్తూ వినియోగదారులను ముఖ్యమంత్రి లూటీ చేస్తున్నారు’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
కర్ణాటక, తెలంగాణ, ఒడిసా, తమిళనాడు సరిహద్దులో ఉన్న ప్రజలు పక్క రాష్ట్రాలకు పోయి కొనుక్కుంటున్నారు అని చంద్రబాబు అన్నారు.
కొసమెరుపు : ఏపీలోని 5 కోట్ల మందిలో సగం మంది మగాళ్లు. వారిలో 60 శాతం మందికి మందు అలవాటుంది. ఇక ఈ మధ్య కొత్త తరం అమ్మాయిలు కూడా మందు అలవాటు చేసుకున్నారు. వారిలో సుమారు 20 శాతం మంది మందు తాగుతున్నారు. అంటే ఏపీలో సగం జనాభా సమస్య అయిన నకిలీ మందును చంద్రబాబు అసలు పాయింట్ గా తీసుకోవడం జగన్ కి ఇబ్బంది కరమే. మందు బాబులు జగన్ పై చాలాకోపంగా ఉన్న మాట నిజమే.
https://twitter.com/nikarbabu/status/1454344846903169026