ఏపీ లోని విజయవాడ, గుంటూరు, తెనాలి, ఏలూరు తదితర ప్రాంతాల్లో సంభవించిన భారీ వరదల కార ణంగా.. ఆయా ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో అక్కడి ప్రజలు నిర్వాశితులయ్యారు. దీనికి తోడు ఆస్తి, ప్రాణ నష్టం కూడా సంభవించింది. వందలాది మంది చెట్టుకొకరు.. పుట్టకొకరు.. అన్నట్టుగా పరిస్థితి మారి పోయింది. నష్టం అంచనా వేసేందుకు సమయం పట్టనుందని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు.. బాధి తుల ఆకలి కేకలు తీర్చేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఈ క్రమంలో కేంద్రం నుంచి కూడా సాయం అందించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమం లో మోడీ సర్కారు ఏపీలో జరిగిన నష్టం పై అంచనాలు రెడీ చేసేందుకు కేంద్ర బృందాన్ని రంగంలోకి దించింది. దీనిలో జాతీయ విపత్తుల శాఖ ఉన్నతాధికారులు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, ప్రాజెక్టుల భద్రతా విభాగం ఉన్నతాధికారులు ఉన్నారు. వీరంతా గురువారం ఉదయం ఏపీకి చేరుకుని.. విజయవాడలో పర్యటిస్తున్నారు.
తొలుత ప్రకాశం బ్యారేజీని పరిశీలించారు. కృష్ణానదికి వచ్చిన వరద ప్రవాహంపై వివరాలు అడిగి తెలుసు కున్నారు. అనంతరం.. విజయవాడ శివారు ప్రాంతం సింగ్నగర్లో పర్యటించారు. ఇదే ప్రధానంగా వరద ప్రభావంతో దెబ్బతినిపోయింది. ఇక్కడి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. అనంతరం.. ఏరియ ల్ సర్వే కూడా చేయనున్నారు. ఇదిలావుంటే.. ఈ బృందం గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ.. భేటీ కానుంది. అనంతరం.. వరద కష్ట నష్టాలపై కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వనుంది. దీని ప్రకారం.. కేంద్రం ఏపీకి సాయం చేయనుందని అధికారులు తెలిపారు.