జగన్ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై పలుమార్లు దాడికి వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించిన సంగతి తెలిసందే. చంద్రబాబు నివాసం దగ్గరకు వెళ్లిన వైసీపీ నేత జోగి రమేష్ నానాయాగీ చేశారు. ఇక, గత ఏడాది నవంబరులో చంద్రబాబు రోడ్ షోలో జరిగిన రాళ్లదాడి ఘటన సంచలనం రేపింది. ఇక, మొన్నటికి మొన్న పులివెందులలో చంద్రబాబు సబా వేదిక వద్ద కొందరు వైసీపీ కార్యకర్తలు రచ్చ చేసేందుకు ప్రయత్నించారు.
ఇక, వినుకొండ సమీపంలో లోకేష్ పై కూడా దాడికి కొందరు యత్నించారు. ఇక, ఈ రోజు తాజాగా అన్నమయ్య జిల్లా అంగళ్లులో టీడీపీ కార్యకర్తలపై రాళ్లదాడి, పుంగనూరులో చంద్రబాబు పర్యటన అడ్డగింత వంటి పరిణామాలు ఏపీ రాజకీయాలలో దుమారం రేపాయి. జడ్ క్యాటగిరీ సెక్యూరిటీతో ఉన్న చంద్రబాబు, లోకేష్ ల పరిస్థితి ఇలా ఉండడంతో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర …కేంద్రానికి ఫిర్యాదు చేశారు.
దీంతో, చంద్రబాబు, లోకేష్ ల భద్రతపై కేంద్రం ఫోకస్ పెట్టింది. చంద్రబాబు, లోకేష్ ల భద్రతపై నివేదిక సమర్పించాలని జగన్ సర్కారును కేంద్ర హోంశాఖ కోరింది. గత ఏడాది నవంబరులో రాళ్లదాడి ఘటనపై సమగ్ర వివరాలతో నివేదినివ్వాలని ఆదేశించింది. అగ్రనేతలకు భద్రత కల్పించడంలో వైసీపీ సర్కారు విఫలమైందని కనకమేడల ఫిర్యాదులో ఆరోపించారు.