• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

CATS-రాజధాని ప్రాంతీయ తెలుగుసంఘం ఆధ్వర్యంలో దసరా-దీపావళి వేడుకలు

admin by admin
November 4, 2021
in NRI
0
0
SHARES
132
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

రాజధాని ప్రాంతీయ తెలుగుసంఘం (CATS) అధ్యక్షురాలు సుధారాణి కొండపు ఆధ్వర్యంలో ఛాంటిలీ , వర్జీనియాలో దసరా-దీపావళి వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి .

కోవిడ్ తరువాత ఎపుడెపుడు పండుగలకు కలుసుకుందామా అని ఎదురు చూసేవారికి ఈవేడుకలు ఎంతో ఆనందాన్ని పంచాయి. CDC guidelines పాటిస్తూ జరిగిన ఈ వేడుకలకు జనరల్ సెక్రటరీ దుర్గాప్రసాద్ గంగిశెట్టి స్వాగతం పలుకగా CATS కార్యవర్గం మరియు మదన్మోహన్ దంపతులు దీపప్రజ్వలన మరియు అభిరామ్ వినాయక ప్రార్థనతో మొదలైంది .

కల్చరల్ ఛైర్ హరీష్ కొండమడుగు తమ అడ్వైజర్లు గోపాల్ మరియు లక్ష్మిబాబు గారి ఆధ్వర్యంలో తమ విభాగం సహాయంతో 150 మందికి పైగా కళాకారులతో 6 గంటలు నిర్విరామంగా NRI streams వారి LED Screens back ground తో జరిగిన ఈ ప్రదర్శనలలో కూచిపూడి డాన్స్ అకాడమీ వారి “ పుత్తడిబొమ్మ పూర్ణమ్మ “ నృత్య నాటిక మరియు ఇంద్రాక్షి , శ్రేష్ఠ ల తెలుగు పద్యపఠనం ప్రత్యేక ఆకర్షణగా నిలువగా సాయికాంత గారి శిష్యుల కాళియమర్ధనం , శ్రావణి డాన్స్ స్కూల్ వారి దసరా థీమ్ , ముద్ర ఆర్ట్స్ వారి కూచిపూడి మరియు నాట్యమార్గంవారి భరతనాట్యం ,లలితారాంపల్లి , మధురంస్కూల్ వారి మధురసంగీతం , హరిగారి వేణుగానం , శ్రవణ్ గారి శిష్యబృంద వాయిద్య నైపుణ్యం , డిసి మెట్రో దేశీటాలెంట్ వారి సంగీత విభావరి , చైతన్యపోలోజు గారి సాంప్రదాయ వస్త్రాలంకరణ( ఫ్యాషన్ షో) స్వర్ణ, సుప్రజల టాలివుడ్ డాన్స్ లు , My Me Time Stories వందేమాతరం డాన్స్ మొదలైన ఎన్నోకార్యక్రమాలతో సంబరాలు అంబరాన్నంటాయన్నారు .

Loudoun County Chair Phyllis Randall
Virginia Senator Jennifer Boysko
Delegate Suhas Subramanyam
Delegate Wendy Gooditis ప్రత్యేక అతిథులుగా విచ్చేసి దీపావళి పండుగను సెలవుదినంగా ప్రకటిస్తున్నట్లుగాను మరియు అక్టోబరు నెలను హిందూ హెరిటేజ్ మంత్ గా ప్రకటిస్తూ పత్రాలను కేట్స్ వ్యవస్థాపకులు చిత్తరంజన్ గారికి మరియు అధ్యక్షురాలు సుధారాణికి అందజేసారు.
అలాగే వేణు నక్షత్రంగారి “అరుగు” పుస్తకాన్ని సుధారాణి కందజేసారు.

ఉపాధ్యక్షులు సతీష్ వడ్డి మన కార్యక్రమానికి దీపావళి అభినందనలందించిన అమెరికా elected dignitaries తో పాటు రాజకీయాలలో మన తెలుగువారు శ్రీధర్ నాగిరెడ్డి , మంగ అనంతాత్ముల , శ్రీలేఖ పల్లెలతో పాటు తదితరులకు కృతజ్ఞతలు తెలియజేసారు.

కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన వర్జీనియలోని ఇతర తెలుగు సంస్థలైన తానా, నాటా , ఆటా , TDF, GWTCS , ఉజ్వల ప్రతినిధులకు జనరల్ సెక్రటరీ దుర్గాప్రసాద్ ధన్యవాదాలను తెలియజేసారు.

ట్రెజరర్ పార్థ బైరెడ్డి స్పాన్సర్లందరికీ కృతజ్ఞతలు తెలియేస్తూ స్పాన్సర్స్ శ్రీనివాస్ అనుగు , భాస్కర్ గంటి , అటార్ని సంతోష్ సోమిరెడ్డి, భూమి కాఫీ పాపారావు , వైరా జ్యూవలెర్స్ , కంట్రీ వోవెన్ శ్రవణ్ పాడూరు, మారం రియాలిటి శ్రీధర్ , రేసన్ ప్రొడక్షన్స్ , బెస్ట్ బ్రెయిన్స్ మరియు నవీన్ రంగా తదితరులకు కృతజ్ఞతలు తెలియచేశారు.

సేవాకార్యక్రమాల విభాగాధిపతి మాట్లాడుతూ దీపావళిని పురస్కరించుకొని నవంబరు 14 వరకు చేసే ( Canned food drive) ఫుడ్ డ్రైవ్ లో మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరారు .

గౌడ్ రాంపురం , జ్యోతి పిసుపాటి మరియు శైలజ గారి నిర్వహణలో ఇక్కడే పుట్టిపెరిగిన భావితరాల తెలుగు తేజాలను ప్రోత్సహిస్తూ జరిపిన వ్యాసరచన
మరియు వక్తృత్వపోటీలలో పాల్గొన్నవారికి బహుమతులందజేసారు.

అధ్యక్షురాలు సుధారాణి మాట్లాడుతూ NRI streams వారి సహకారంతోనే ఈ నిర్వహణలో ఎంతగానో సహకరించిన ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎల్.ఇ.డి డిస్ప్లే లద్వారా మరింత అందమైన అనుభూతిగా ఈ కార్యక్రమం జరిగిందని తెలియజేసారు.
జులై1-3 తేదీలలో జరిగే ఆటా కన్వెన్షన్ లో కేట్స్ కో-హోస్ట్ గా వ్యవహరించడం తమకెంతో గర్వంగా ఉందన్నారు.

ఈ విజయోత్సవానికి ఎంతగానో కృషిచేసిన తమ కార్యవర్గసభ్యులకు , చక్కటి భోజనాన్ని అందించిన తత్వ రెస్టారెంట్ మరియు మాల్గుడి యాజమాన్యానికి , మీడియా శ్రీనివాస్ శీరపు మరియు విలేఖరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Previous Post

జగన్ కి సెగ పెట్టిన గోవా సీఎం

Next Post

వెంకన్న స్వామినీ వెయిట్ చేయిస్తున్న జగన్

Related Posts

NRI

NTR-శక పురుషునికి ‘డెట్రాయిట్’ శత జయంతి నీరాజనం!

June 2, 2023
NRI

BRS-June 2న, అమెరికా వ్యాప్తంగా, 25 నగరాల్లో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు!

June 1, 2023
NRI

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

June 2, 2023
NRI

‘నారా లోకేష్’ సహకారంతో ఆధునాతన రాట్నం!

May 31, 2023
NRI

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

May 30, 2023
chandrababu in mahanadu
NRI

‘తెలుగు హెరిటేజ్ వీక్’…నార్త్ కరోలినా గవర్నర్ కు చంద్రబాబు ధన్యవాదాలు

May 30, 2023
Load More
Next Post

వెంకన్న స్వామినీ వెయిట్ చేయిస్తున్న జగన్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఆనంపై దాడి…జగన్ కు లోకేష్ డెడ్లీ వార్నింగ్
  • వైసీపీ మూకలను తరిమికొట్టిన ఆనం రమణారెడ్డి…వైరల్
  • టీడీపీ, బీజేపీల పొత్తుపై తేల్చేసిన బండి సంజయ్
  • టీడీపీ ఎమ్మెల్యే డోలా అరెస్ట్..కొండపిలో హై టెన్షన్
  • జగన్ అప్పులపై ఆనం సంచలన వ్యాఖ్యలు
  • మ‌నోడే అయినా.. విమ‌ర్శిస్తే లాగేయ‌డ‌మే: వైసీపీ ఇంతే గురూ!
  • టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ
  • ఆ స్థానంలో పవన్ 60 వేల మెజారిటీతో గెలుస్తారంటోన్న రఘురామ
  • జగన్ పాము వంటి వాడు… లోకేష్ ఫైర్
  • చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?
  • ఒడిశా రైలు ప్రమాదంపై రాహుల్ రామకృష్ణ వివాదాస్పద వీడియో
  • పరదాల విషయంలో జగన్ బాటలోనే కేసీఆర్!
  • జగన్ పై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్
  • ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన
  • రాష్ట్రం విడిపోయి 9 ఏళ్లు.. చెప్పేందుకు ఏముంది …!

Most Read

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

NTR-శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra