24 గంటల్లో 21 లక్షల రూపాయల విరాళాలు – గుండెపోటుతో కాలిఫోర్నియా నివాసి దుర్గా చింతల మృతి చెందారు. కాలిఫొర్నియా – శాక్రమెంటో లొ 15 ఏండ్లు నివాసమున్న దుర్గా చింతల కోవిడ్ సమయాన భారత్ వెళ్ళారు. అక్కడ గత నెలలో రెండు మార్లు వచ్చిన బ్రెయిన్ స్ట్రోక్ నుండి దుర్గా కోలుకుంటూ ఉండగా, తదనంతరం ఏప్రిల్ 23న గుండెపోటుతొ విజయవాడలో మరణించారు. దుర్గా కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ సందర్భంగా, దుర్గా ఆసుపత్రి, పిల్లల చదువు ఖర్చు నిమిత్తం ‘గోఫండ్‌మి’లో స్థానిక శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) దాతలనుండి సాయం కోరింది.
ఈమేరకు ‘గోఫండ్‌మి’సైట్లో టాగ్స్ ఓ పేజీ : https://gofund.me/e841e501
క్రియేట్ చేసింది. వారి అభ్యర్థనకు అనూహ్యమైన స్పందన వచ్చింది. పేజ్ క్రియేట్ చేసిన 24 గంటల వ్యవధిలోనే దాదాపు 350 మంది దాతల నుండి 21 లక్షల రూపాయలు (ముప్పై వేల డాలర్లు) పోగయ్యాయి.
పలువురు దాతలు దుర్గ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, స్థానిక తెలుగు సంఘం టాగ్స్ వేడుకల్లో దుర్గా మరియూ ఆయన కుటుంబసభ్యులు ఆహుతులకు కొసరి భోజనం ఆత్మీయంగా వడ్డించిన సందర్భాలను వారు గుర్తు చేసుకున్నారు.
దుర్గా కూడా అందరిలాగే తన కుటుంబ భవిష్యత్తుకోసం ఎన్నో కలలు కన్నాడని, ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే అతడు.. అవసరం ఉన్నవాళ్లకు సాయం చేసేవాడని పలువురు స్థానిక తెలుగు ఎన్నారైలు చెప్పారు. కానీ అనుకోకుండా అతని జీవితం ఇలా ముగుస్తుందని ఎవరూ ఊహించలేదని వారు వాపోయారు.
లక్షన్నర డాలర్లు పోగు చేసి దుర్గా కుటుంబానికి సాయంగా ఇవ్వాలని టాగ్స్ లక్ష్యంగా పెట్టుకుంది. హదూద్ తుఫాను బాధితులకు, కర్నూలును ముంచెత్తిన వరద బాధితులకు, స్థానికంగా జరిగిన పలు సేవా కార్యక్రమాలలో దుర్గా ప్రముఖ పాత్ర పోషించారు. అకాలమరణం చెందిన దుర్గా ఆసుపత్రి ఖర్చులకు, పిల్లల విద్యా అవసరాల నిమిత్తం దాతలు పెద్దమనసుతో ముందుకురావాలని టాగ్స్ కోరింది.
http://sactelugu.org/donationtodurga/ సైటు నుండి కూడా తమకు తోచిన సాయం చేయవచ్చునని టాగ్స్ నెటిజన్లకు విజ్ఞప్తి చేసింది. “గోఫండ్ మి” గురించి మరింత సమాచారం కోసం ఫోన్ నెంబరు: 859-536-5308 కు సంప్రదించవలసినదిగా టాగ్స్ కోరింది. దుర్గా కుటుంబం కు ఈ విషాద సమయంలో అందరూ స్పందించి మానవత్వం చాటాలని దుర్గా సన్నిహితులు పిలుపు ఇచ్చారు.