వైసీపీ నుంచి గెలిచినా… తమ ప్రభుత్వం ప్రజల వాయిస్ ను పట్టించుకోవడం లేదన్న ఆవేదనతో వారి గొంతుగా మారి… ఎప్పటికపుడు ఏపీ ప్రజల వాస్తవ సమస్యలను, అభిప్రాయాన్ని ప్రభుత్వానికి బహిరంగంగా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని మేల్కొలుపుతున్నారు నరసాపురం ఎంపీ రఘురామరాజు. నిజమైన ప్రజాప్రతినిధిగా మారిన ఆయనను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు అభిమానించడం మొదలుపెట్టారు.
ఏ మీడియా ఎవరి వైపున్నా రఘురామరాజు మాత్రం ప్రజల వైపు ఉంటారన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా కలగడంతో ఆయన రచ్చబండ సమావేశాలు నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచాయి. వెంకటేశ్వరస్వామి భక్తుడిగా హిందుమతం కోసం బీజేపీ కంటే బలమైన వాయిస్ వినిపిస్తున్న రాజుగారికి హిందుత్వ వాదులు కూడా అండగా నిలుస్తున్నారు. అయితే, అనుకోకుండా రాజుగారికి బైపాస్ సర్జరీ అవసరం ఏర్పడింది.
ఈరోజు ఉదయమే నమస్తేఆంధ్ర రాజుగారితో స్వయంగా మాట్లాడింది. ఆయన క్షేమంగా ఉన్నారు. ముంబైలోని ఏసియన్ హార్ట్ ఆస్పత్రిలో ఆయనకు సర్జరీ జరుగుతోంది. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీసుస్సులు ఆయనకు పుష్కలంగా ఉన్నాయని… ఆయన త్వరగా కోలుకుంటారని ఆయన్ను అభిమానించే తెలుగు ప్రజలు దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. మరో మూడు రోజుల్లో ఆయన సాధారణంగా తన పనులు తాను చేసుకునేలా కోలుకుంటారని వైద్యులు చెప్పినట్లు ఆయన ద్వారా తెలిసింది.
కార్తీక పౌర్ణమి రోజున ఆ శస్త్ర చికిత్స జరుగుతున్న నేపథ్యంలో ఆ మహాశివుడి ఆశీస్సులు కూడా ఆయనకు ఉంటాయని ఆయన శ్రేయోభిలాషులు చెబుతున్నారు. రాజుగారు త్వరగా కోలుకుని రచ్చబండతో మళ్లీ ప్రజల ముందుకు త్వరగా వచ్చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.