తెలుగు సినిమా పరిశ్రమను తీవ్ర ఇబ్బందులు పెడుతున్న జగన్ మోహన్ రెడ్డికి సినిమా వేదికగా పవన్ వార్నింగ్ ఇచ్చారు. సినిమాలను ఆపేస్తే కాళ్ల బేరానికి వస్తాం అనుకుంటున్నారేమో… పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుంది మీరు అంటూ పవన్ వార్నింగ్ ఇచ్చారు. మీరు అక్రమాలు చేసి, అవినీతి చేసి కోట్ల కొద్దీ బ్లాక్ మనీని దాచుకున్నారు.
పులివెందుల నేలమాళిగల్లో వేల కోట్ల బ్లాక్ మనీ దాచిపెట్టారు అని పోలీసులే మాట్లాడుకుంటున్నారు. తప్పుడు పనులు, అవినీతి చేసే మీరు కష్టపడి రకరకాల విన్యాసాలు చేసి అందరినీ ఎంటర్టైన్ చేస్తూ డబ్బులు సంపాదించుకునే సినిమా వాళ్లను కంట్రోల్ చేయాలని చూస్తారా?
సినిమా వాళ్లతో సోదరభావం అనే సన్నాసి మంత్రికి…. పన్నులు కట్టి తమ బతుకు తాము బతికే వారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు పవన్. చిత్ర పరిశ్రమకు అక్కరకు రాని సోదర భావన ఎందుకు? వెళ్లి దిబ్బలో కొట్టుకోవడానికా!. సినిమా టిక్కెట్లను ఆంధ్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవాలనుకుంటుందంటే వాళ్ల దగ్గర డబ్బులు లేవు. చిత్ర పరిశ్రమ మీద వచ్చే ఆదాయాన్ని బ్యాంకులకు చూపించవచ్చు. లోన్స్ తెచ్చుకోవచ్చు. దాని కోసమే టికెట్స్ అమ్మకాన్ని తీసుకుంటున్నారు.
మీరు లక్ష కోట్లు సంపాదించొచ్చు. మీరు ఒకసారి రాజకీయాల్లోకి వచ్చి ముప్పై ఏళ్లు అధికారంలోకి ఉండాలనుకునే కోరికలుంటాయి కానీ, సినిమా వాళ్లు వ్యాపారం చేసుకునేవాళ్లకు ఎదగాలని ఉండదా. వైసీపీ ప్రభుత్వం థియేటర్స్ విషయంలో ఇబ్బంది పెడతారు. చిరంజీవి గారి లాంటి వ్యక్తులకు చెప్పండి ప్రాధేపడొద్దని. హక్కుతో మాట్లాడమని చెప్పండి. సినీ పెద్దలు, సంపూర్ణ విద్వాంసులు బయటకు రండి. ఖండించండి. తప్పని చెప్పండి. చిత్ర పరిశ్రమ వైపు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీరు మారకపోతే, మీరు మార్చేలా ఎలా చేయాలో మాకు తెలుసు’’ అన్నారు.
పవన్ మాట్లాడిందంతా ఒకెత్తు. పులివెందుల విషయం మరో ఎత్తు. జగన్ పై లక్ష కోట్ల అవినీతి ఆరోపణలున్నాయి. వాటిలో 43 వేల కోట్లకు ఆధారాలు దొరికాయి. మరి మిగతా 57 వేల కోట్లు ఎక్కడున్నాయి అని ఇప్పటివరకు అందరికీ అనుమానంగా ఉండేది? మరి పవన్ చెబుతున్నది ఆ మిగిలిన డబ్బు గురించేనా? పులివెందుల నేలమాళిగల్లో డబ్బున్నాయని పవన్ చెబుతున్నది దాని గురించేనా?? ఏమో మరి… ఇది ఎవరు లెక్క తేలుస్తారో చూడాలి.