2025కు గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలలో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గద్దర్ కు పద్మ భూషణ్ ప్రతిపాదించినా కేంద్రం పట్టించుకోలేదని రేవంత్ అన్నారు. ఈ కామెంట్లపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్లు చేశారు. పద్మ అవార్డులకు ఎలిజిబులిటీ ఉన్న వ్యక్తుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం పంపలేదని ఆయన చెప్పారు. అయినా, గద్దర్ కు పద్మ అవార్డు ఎట్లా ఇస్తాం? అని ప్రశ్నించారు.
ఎంతో మంది బీజేపీ కార్యకర్తలను నక్సలైట్లతో కలిసి హత్య చేయించిన వ్యక్తి గద్దర్ అని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. గద్దర్ నక్సల్స్ భావజాలం ఉన్న వ్యక్తి అని, ఎంతోమంది పోలీసులను చంపించిన వారిలో గద్దర్ కూడా ఉన్నారని ఆరోపించారు. కాబట్టే ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న గద్దర్ అవార్డులను కూడా తాము తీసుకోబోమని చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబు తండ్రిని, మాజీ మంత్రి డీకే అరుణ తండ్రిని చంపింది నక్సలైట్లు కాదా? అని సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ నేతలను గద్దర్ చంపించారన్న విషయం రేవంత్ కు తెలియదా అని నిలదీశారు. ఎంపీ ఈటల రాజేందర్ నక్సలైట్ కాదని, భావజాలం వేరు.. నక్సలైట్ గా పని చేయడం వేరని సంజయ్ అన్నారు.లేదన్నారు.
ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు. ఎల్టీటీ ప్రభాకరన్, నయీమ్‌తో గద్దర్‌ను పోల్చారు విష్ణువర్ధన్‌రెడ్డి. రాజ్యాంగాన్ని విశ్వసించని గద్దర్‌కు పద్మ పురస్కారం ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. మావోయిస్టు నేత గద్దర్ కుమార్తె కాంగ్రెస్‌లో ఉన్నందుకు గద్దర్‌కు పద్మ పురస్కారం ఇవ్వాలా, రాజీవ్‌ను చంపిన వారికి పద్మ పురస్కారం ఇవ్వాలా రేవంత్? అని ఆయన ప్రశ్నించారు.