నాంపల్లి బీజేపీ కార్యాలయం ఎదుట అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఒక యువకుడు కిరోసిన్ ఒంటి మీద పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసే ప్రయత్నం చేశారు. అయితే.. అక్కడి వారు వెంటనే స్పందించటంతో పెను ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలానికి చెందిన శ్రీను అనే యువకుడు ఆదివారం బీజేపీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేయటం సంచలనంగా మారింది.
ఆ మధ్యన బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. దీనిపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తెలంగాణ అధికారపక్షం తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. ఇలాంటి పనులు చేస్తే.. కేంద్రంలో తమ ప్రభుత్వం ఉందన్న విషయాన్నిమర్చిపోకూడదంటూ బీజేపీ ఎంపీ అరవింద్ లాంటి వారు ఆగ్రహాం వ్యక్తం చేయటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం బండి సంజయ్ ను అరెస్టు చేసినందుకు నిరసనగా ఆత్మహత్యాయత్నం చేసినట్లు వెల్లడించారు. బండి సంజయ్ మీద చేయి వేస్తే సహించేది లేదన్న శ్రీను.. అరెస్టు చేసిన రోజున తనకుఆరోగ్యం బాగోలేదని.. అందుకే ఊరుకున్నానని.. అందుకే ఇప్పుడు సూసైడ్ అటెంప్టు చేసినట్లు పేర్కొన్నారు. తన అభిమాన నాయకుడ్ని పోలీసులు అనవసరంగా అరెస్టు చేస్తే.. పోరాడాలే కానీ ప్రాణాలు తీసుకుంటానని బెదిరిస్తే ఏం బాగుంటుంది శ్రీను? అయినా.. ప్రాణాలు తీసుకుంటే కలిగే ప్రయోజనం ఏమిటంట?