ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వైఎస్సార్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఛాలెంజ్ చేశారు.
దమ్ము ధైర్యం ఉంటే వైసీపీలో గెలిచిన నువ్వు ఎంపీ సీటుకు, పార్టీకి రాజీనామా చేయాలని ఛాలెంజ్ చేశారు. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి టీడీపీ టిక్కెట్‌పై పోటీ చేసి గెలవాలని ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సవాల్ చేశారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి బొమ్మను పెట్టుకుని రఘురామకృష్ణంరాజు ఎన్నికల్లో గెలిచారని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని ఎంపీ రఘురాముడు కొనియాడుతున్నారని విమర్శించారు.
ఇది సరే బాలినేని మరి… వైసీపీకి ఎందుకు సిగ్గులేకుండా అతన్ని సస్పెండ్ చేసే అధికారం ఉన్నా కూడా మీ పార్టీలోనే ఉంచుకుంది? మీకు అతన్ని సస్పెండ్ చేయడానికి దమ్ములేనపుడు… రఘురామరాజుకు కూడా రాజీనామా చేసే దమ్ములేదని సరిపెట్టుకోండి.
పవర్ మీ చేతిలో పెట్టుకుని అతన్ని ఎందుకు సస్పెండ్ చేయరు. ఫ్లైటేసుకుని అంతమంది వెళ్లి స్పీకర్ ను కలిసి ఎంపీ పదవి రద్దు చేయిస్తామని ప్రగల్బాలు పలికారు. ఎందుకు ఆ పని చేయలేకపోయారు. వీటికి కూడా సమాధానాలు చెప్పాలి కదా మంత్రి గారు.