‘యన్.టి.ఆర్’ రెండు సినిమాలు, రూలర్.. ఇలా వరుసగా డిజాస్టర్లు ఎదురయ్యేసరికి నందమూరి బాలకృష్ణ పనైపోయిందని చాలామంది తీర్మానించేశారు. కానీ ‘అఖండ’తో అందరికీ దీటైన సమాధానమే చెప్పాడు నందమూరి హీరో.
ఈ సెన్సేషనల్ హిట్ తర్వాత ‘క్రాక్’ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాను పట్టాలెక్కించి అభిమానులను ఆనందంలో ముంచెత్తాడు. మంచి హైప్ మధ్య ఈ సినిమా మొదలైంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ప్రోమోలు అభిమానులను ఎగ్జైట్ చేశాయి. ఇది స్యూర్ షాట్ హిట్ అని ధీమాగా ఉన్నారు ఫ్యాన్స్.
దీని తర్వాత అనిల్ రావిపూడి లాంటి మరో ఫాంలో ఉన్న దర్శకుడితో బాలయ్య జట్టు కడుతుండటం ఫ్యాన్స్‌ను ఇంకా ఎగ్జైట్ చేస్తోంది. ఈ సినిమా గురించి అనిల్ చెబుతున్న మాటలు కూడా వారిలో అంచనాలు పెంచేస్తున్నాయి.
కాగా ఈ చిత్రానికి అప్పుడే టైటిల్ కూడా ఖరారైపోయినట్లు సమాచారం. ‘బ్రో.. ఐ డోంట్ కేర్’ అనే ట్రెండీ, మోడర్న్ టైటిల్‌ను ఈ చిత్రానికి అనిల్ ఖరారు చేశాడట. మామూలుగా బాలయ్య టైటిళ్లు తెలుగులో, మాసీగా ఉంటాయి. కానీ ఈ చిత్రానికి ఇంగ్లిష్‌లో, భిన్నమైన టైటిల్ పెట్టాలని ఫిక్సయ్యాడట అనిల్.
ఈ చిత్రంలో ‘బ్రో’ అనేది బాలయ్య ఊతపదం అని.. ఎవ్వరినీ లెక్కచేయని పాత్ర కావడంతో ‘ఐ డోంట్ కేర్’ అనే మాటను జోడించి టైటిల్ పెట్టారని అంటున్నారు. గబ్బర్ సింగ్, అర్జున్ రెడ్డి, పోకిరి తరహాలో లీడ్ రోల్ క్యారెక్టర్ మీద నడిచే సినిమా ఇదని, ఇందులో బాలయ్య కూతురిగా శ్రీలీల నటిస్తోందని.. తన కెరీర్లో ఇప్పటిదాకా సినిమాలన్నింటికీ భిన్నంగా ఈ సినిమా ఉంటుందని.. తన కెరీర్లో ది బెస్ట్ వర్క్‌గా ఈ సినిమాను చెప్పొచ్చని అనిల్ రావిపూడి ‘ఎఫ్-3’ ప్రమోషన్ల సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం తెలిసిందే.