కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. గత 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. మళ్లీ అసెంబ్లీ ఎన్నిక జరుగుతుండడం ఇదే తొలిసారి. బద్వేల్ నుంచి గెలిచిన వెంకట సుబ్బయ్య మరణంతో.. ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది.
ఈ ఉప ఎన్నికలో రెండు ప్రధాన పార్టీలు.. టీడీపీ, జనసేనలు పోటీ నుంచి దూరంగా ఉంటున్నాయి. పరోక్షంగా జనసేన మాత్రం బీజేపీకి సహకరిస్తున్నది. పవన్ ఇక్కడ నుంచి తాము అభ్యర్థిని నిలబెట్టబోమని చెప్పారు. కానీ , తన మిత్రపక్షం బీజేపీ ఇక్కడ నుంచి పోటీ చేస్తుంటే.. ఆయన మద్దతిచ్చారు. అయితే.. బీజేపీకి ఇక్క ఈ ఒక్కటే కాదు.. అనేక ప్లస్సులు ఉన్నాయి.
ఈ బద్వేల్ ఉప ఎన్నిక.. టీడీపీ మాజీ నేతలుగాఉన్న మాజీ మంత్రి ఆది నారాయణరెడ్డికి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్‌కు కూడా అగ్ని పరీక్షగా మారిందని అం టున్నారు. ఎందుకంటే.. జిల్లాలో అత్యంత కీలక నాయకులుగా వీరిద్దరే చలామణి అవుతున్నారు. పైగా కేంద్రంలోనూ దుమ్ము దులపాలని భావిస్తున్నారు. సో.. ఇప్పుడు వీరు ఈ అవకాశాన్ని వినియోగించుకుం టారనే చర్చ సాగుతోంది.
మరోవైపు.. బీజేపీ దళం మొత్తం.. బద్వేల్‌లోనే పాగా వేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి.. ఇలా అనేక మంది నాయకులు వచ్చారు. వీరికితోడు కేంద్రంలోని మంత్రులు.. కూడా ఇక్కడ క్యూకట్టారు.
ఇక, తెలంగాణకు చెందిన హర్ష వర్ధన్‌రెడ్డి వచ్చి.. ఫైర్ బ్రాండ్ వ్యాఖ్యలు చేశారు. సో.. ఇలా.. ఒక్క ఉప ఎన్నిక కోసం.. బీజేపీ సర్వశక్తులూ ఒ
అయితే రాజకీయ వర్గాల చర్చలు, పరిశీలకులు మాత్రం సెంటిమెంటు ప్రధానంగా జరుగుతున్న ఇలాంటి ఎన్నికలో గెలుపును పక్కన పెడితే.. కనీసం.. గౌరవప్రదమైన ఓట్లు లభిస్తే.. ఎక్కువని అంటున్నారు. ఏపీ జనాలకు బీజేపీ మీద పీకల దాకా కోపం ఉంది. అసలు ఆ పార్టీ గెలుపు కాదు కదా.. కనీసం డిపాజిట్ తెచ్చుకున్నా గొప్పే అని.. అసలు నోటాను అయినా దాటుతుందా ? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.