చివరకు బీజేపీ, కాంగ్రెస్ కు కూడా వైసీపీ భయపడే పరిస్థితి రావడం ఆ పార్టీకి నానాటికీ ఆదరణ తగ్గుతుందనది చెప్పడానికి మంచి ఉదాహరణ.
లేకపోతే క్యాడరే లేని బీజేపీ, కాంగ్రెస్ వైసీపీ అభ్యర్థిపై బరిలో ఉంటే వైసీపీ అభ్యర్థిని గెలిపించడానికి వేరే నియోజకవర్గాల నుంచి దొంగ ఓటర్లను వైసీపీ నాయకులు పట్టుకువచ్చారు.
మీడియ సాక్షిగా వారంతా దొరికిపోయారు. వారిని ఇతర ఓటర్లు చెప్పుతో కొట్టబోయారు. అందరూ అడ్డుకోవడం ప్రమాదం తప్పింది.
తెలుగుదేశం జనసేన పార్టీలు బరిలోనుంచి తప్పుకున్నా కూడా వైసీపీకి గెలుపు భయం, మెజారిటీ భయం ఉందంటే… జనంలో జగన్ పాలనపై ఎలాంటి అభిప్రాయం ఉందో ఇప్పటికే అర్థమవుతోంది.
అట్లూరు మండలంలో దొంగ ఓట్లను పెద్ద సంఖ్యలో మీడియా పట్టుకుంది.
బద్వేలు లో బీజేపీ ని ఓడించడానికి వైకాపా వారి తిప్పలు, దొంగ ఓటర్లు, ఇలా చేసే వేలల్లో మెజారిటీ తెచ్చుకుంటారా? #Badvel #UANow #YCP #BJP pic.twitter.com/1sryqwwiA5
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) October 30, 2021
బద్వేల్ లో ఏడు నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు దొంగ ఓట్లు వేయించేందుకు కుట్రపన్నారు#BadvelByPoll #Badvel pic.twitter.com/lW9h8Icdap
— Dr Parthasarathi / डॉ पार्थसारथी / డా పార్థసారథి (@drparthabjp) October 30, 2021