శాన్ జోక్విన్ వ్యాలీలో వైద్యపరంగా అవకాశాలు తక్కువ ఉన్న ఏరియాలో సేవలందించే వైద్యులకు, విద్య మరియు శిక్షణ ఇవ్వడానికి, వైద్య కళాశాల స్థాపనకు మద్దతుగా, ‘ఆర్య విశ్వవిద్యాలయం’ ‘ది రవి అండ్ నైనా పటేల్ ఫౌండేషన్’ నుండి $1 మిలియన్ గ్రాంట్‌ను అందుకుంది.
‘రవి అండ్ నైనా పటేల్ ఫౌండేషన్’ను ఆంకాలజిస్ట్ ‘డాక్టర్ రవి పటేల్’ మరియు కార్డియాక్ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ ‘నైనా పటేల్’ స్థాపించారు. 1998లో, డాక్టర్ పటేల్ మరియు యువ వైద్యుల బృందం బేకర్స్ఫీల్డ్ లో అత్యాధునిక క్యాన్సర్ సంరక్షణను అందించే సమగ్ర రక్తం మరియు క్యాన్సర్ కేంద్రాన్ని నిర్మించారు.
తమ క్లినికల్ ప్రాక్టీస్‌తో పాటు, డాక్టర్ పటేల్స్ స్థానిక కెర్న్ కౌంటీ కమ్యూనిటీ క్యాన్సర్ రోగులకు మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక దాతృత్వ ప్రాజెక్టులలో పాల్గొన్నారు.