బీజేపీ ఫైర్ బ్రాండ్ అరవింద్ టీఆర్ ఎస్ పై విమర్శల దాడి చేశారు. హైదరాబాదు వరద బాధితులకు సాయం చేస్తున్నామని కేటీఆర్ చెబుతున్నారు. నువ్వు ప్రజలకు సాయం చేసేదేంటి… వారి డబ్బు వారికి తిరిగి ఇస్తున్నావు. అది కూడా కేంద్రం మంజూరు చేసిన డబ్బు నుంచే ఇస్తున్నావు. నువ్వేంది నీ భాషేంది? నిన్ను సిరిసిల్లలో ఓడిస్తాం… రెడీగా ఉండు అని అరవింద్ ధర్మపురి హెచ్చరించారు.
ప్రజలు పన్నులు కడితే ఆ పన్నులతో వారికిస్తున్నారు. మీరేదో సాయం చేస్తున్నట్లు ప్రజలను బిచ్చగాళ్లను చేసి మాట్లాడతారా అని అరవింద్ విమర్శించారు. ప్రజల డబ్బును వారికే ఇస్తూ డబ్బా కొట్టుకుంటారా? కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు తీసుకుంటున్న జీతాలు కూడా ప్రజల డబ్బే.. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.
దుబ్బాకలో ఏడు చెరువుల నీళ్లు తాగించాం. వచ్చే ఎన్నికల్లో నీ ఓటమి గ్యారంటీ. పాతబస్తీలో పాన్ దుకాణం తీయమంటే మీకు ఫ్యాంటు తడుస్తుంది. గుజరాత్ లో 2 లక్షల అక్రమ కట్టడాలు తొలగించారు మోడీ. ఆయనపై డొల్ల విమర్శలు చేస్తారా ? అని అరవింద్ నిలదీశారు. కేసీఆర్ కొడుకు కాబట్టి ఇష్టానుసారం మాట్లాడతాను అంటే కుదరదు ఇక్కడ అన్నారు.