ఈరోజు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వలంటీర్లను నియమించి ఏడాది అయిన సందర్భంగా వారి సేవలను గుర్తిస్తూ రాష్ట్రంలో అందరి చేత చప్పట్లు కొట్టించారు. బానే ఉంది. ఇది వారిలో ఉత్సాహం నింపుతుందని పిలుపునిచ్చారు. కొందరు ఆయన మాట విని చప్పట్లు కూడా కొట్టారు.
ఇక ఏడాది కాలంగా గ్రామవలంటీర్లలో కొందరు అరాచకాలకు పాల్పడ్డారు. డబ్బులు ఎత్తుకెళ్లారు. కమీషన్లు తిన్నారు. అత్యాచారాలు చేశారు. ఈవ్ టీజింగ్ లు చేశారు. వలంటీర్లలో పది శాతం మంది ఇలాంటి వెధవలు ఉన్నా 90 శాతం మంది బానే పనిచేస్తారనుకుందాం. వారి గురించే మాట్లాడుకుందాం.
జగన్ సర్కారు… గతంలో నిరుద్యోగం గురించి ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఊదరగొట్టారు. డీఎస్సీలో తక్కువ పోస్టులు నింపుతున్నారని కూడా విమర్శించారు. ఇక నిరుద్యోగుల వాయిస్ గా మారినట్టు బాగా నటించారు. కానీ జగన్ అధికారంలోకి వస్తే టపాటపా అన్ని నోటిఫికేషన్లు వచ్చేస్తాయి. మాకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్న వారి కలలన్నీ చిదిమేశారు జగన్ రెడ్డి.
ఎదుగుబొదుగు లేని ఏడాది కాలపరిమితి వలంటీర్లను నియమించారు. అంటే ప్రతి ఏడాది వారు మా జీతం పెరుగుతుందన్న ఆలోచన కూడా రానీయకుండా చేసిన ప్లాన్ ఇది. మా ఉద్యోగం ఉంటే చాల్రా జీతం పెంపు తర్వాత అని అనుకునే ఒక విచిత్రమైన ఉద్యోగాన్ని సృష్టించారు. దానికి ఎటువంటి భద్రత లేదు. భవిష్యత్తు లేదు.
‘‘నిజానికి గ్రామ వాలంటీర్ వ్యవస్థ సంవత్సరం అయిన సందర్భంగా వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేసి… వారికి ఉద్యోగ భద్రత కల్పించి ఉంటే బాగుండేది. భద్రత లేని ఉద్యోగాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కదా. ఊరికే చప్పట్లు, గిన్నెలు కొడితే ఏమొస్తుంది’’ అని వలంటీర్లలోనే కాదు, వారి సేవలు అందుకుంటున్న ప్రజల్లోను అసంతృప్తి కనిపిస్తుంది.
డిగ్రీలు పీజీలు చేసి పిల్లలతో భవిష్యత్తును ఎదగనీయకుండా 8 వేలకు గొడ్డు చాకిరి చేయించుకుంటు వారిని భవిష్యత్తును బలి చేస్తోంది గవర్నమెంటు. గ్రూప్ 5 ఉద్యోగాలుగా అయినా గుర్తించి వారికి భరోసా కల్పిస్తే మంచిగుండేది. ఆరోజు మోడీ చప్పట్లు కొట్టమంటే కామెడీ చేసిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఈరోజు అవే చప్పట్ల గురించి తెగ ప్రచారం చేస్తున్నారు.
ఉత్తమ పనితనం కనబరిచిన వలంటర్లీకు ఉద్యోగ భద్రత కల్పించడంపై జగన్ సర్కారు కాస్త దృస్టిపెడితే మంచిది.