యాంకర్ రష్మి లవర్ కి మెగాస్టార్ సినిమాలో ఛాన్స్

Movies Oct 03, 2020


పేరు చెప్పకపోయినా చటుక్కున పట్టేశారు కదా అతనెవరనేది. ఎంతైనా మా పాఠకులు చాలా అప్ డేట్ గా ఉంటారు. జగమెరిగిన జబర్దస్త్ యాంకర్ రష్మి లవర్ సుధీర్ కి చిరంజీవి ఛాన్స్ ఇచ్చారు. ఇది ఠాగూర్ సినిమాలో సునీల్ కి దక్కిన అవకాశం వంటిది అంటున్నారు. జబర్దస్త్ తో పాపులర్ అయిన సుధీర్ అంతకు మించి రష్మి - లవ్ అఫైర్ వల్ల ఎక్కువ పాపులారిటీ వచ్చింది.

విచిత్రం ఏంటంటే... గత ఐదారేళ్లుగా వస్తున్న ఈ గాసిప్ ను వారు ఖండించరు. పైగా దానికి తగినట్టే టీవీ ప్రోగ్రాముల్లో సిగ్గుపడుతూ ఆ గాసిప్ కి మరింత క్రేజ్ తెస్తుంటారు. అందుకే అతన్ని సుడిగాలి సుధీర్ అని పిలిచినా గుర్తుపడతారు. రష్మి లవర్ అని చెప్పినా గుర్తుపడతారు.

ఇక చిరంజీవి సినిమా ఛాన్స్ గురించి చెప్పాలంటే దీని పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయిన ఆచార్య సినిమా ఛాన్స్ ఇచ్చారా?లేక వినాయక్ సినిమాలో ఛాన్సిచ్చారా? లేక మెహర్ రమేష్ సినిమాలో ఛాన్సిచ్చారా ? అన్నది ఇంకా తేలలేదు.

బహుశా ఈ ముగ్గురిలో వినాయక్ కామెడీకి ఫేమస్. కాబట్టి సుధీర్ బ్యాక్ డ్రాప్ వంటివి కూడా ఆలోచిస్తే వినాయక్ సినిమాలోనే అతనికి అవకాశం దక్కి ఉండొచ్చని చెబుతున్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.