జనాల్ని ఎలా మెప్పించాలో వైఎస్ కుటుంబానికి బాగా తెలుసు. ఇక జగన్ ది అందులో పీహెచ్డీ. లేకపోతే అడ్డదిడ్డంగా పన్నులు వేసినా జగనన్న గొప్పోడు అంటున్నారంటే అది కచ్చితంగా టాలెంటే.
ఇంతకీ ఏమిటి జగన్ పై ప్రశంసలు అనుకుంటున్నారా.. మోడీ సర్కారు జగన్ ని అభనందించింది. ఎందుకో తెలుసా… కేంద్రం మాట విని అడ్డదిడ్డంగా జనంపై ట్యాక్సులు బాదినందుకు జగన్ గ్రేట్ అని పేర్కొంది.
మరుగుదొడ్ల లెక్కన ఇళ్లకు పన్నులేయడం
పెట్రోలుపై రోడ్డు సెస్సు వేయడం
రేషన్ సరుకులకు కత్తెర వేయడం
రిజిస్ట్రేషన్ల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెంచడం…
ఇక రైతులకు మీటర్లు పెట్టడం
రోడ్లపై కొత్తగా టోల్ గేట్లు పెట్టడం
ఇలా జనానికి ట్యాక్సులు కట్టడం అలవాటు చేసే సంస్కరణలు తీసుకోవడంతో సంస్కరణల అమల్లో జగన్ కి మొదటి ర్యాంక్ దక్కింది. జగన్ తో పాటు మధ్య ప్రదేశ్ సీఎంకి కూడా అవార్డు దక్కింది. దీనికి రివార్డుగా స్థానిక సంస్థల్లో సంస్కరణల అమలుకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 2,525 కోట్ల రూపాయలు, మధ్యప్రదేశ్‌కు రూ. 2,373 కోట్ల కొత్తగా రుణ సౌకర్యం కల్పించింది కేంద్రం.
చిత్రమైన విషయం ఏంటంటే… ఏపీలో ఏ టౌన్ చూసినా, ఏ జిల్లా కేంద్రం చూసినా మట్టికొట్టుకుపోయి, రోడ్లు పాడైపోయాయి. డబ్బుల్లేవు. పెట్రోలు పై సెస్సు వేస్తాను, టోల్ గేట్లు పెడతాను ఆ డబ్బులతో రోడ్లు వేస్తాను అన్నారు జగన్. కానీ పెట్రోల్ పై సెస్సు వేసి ముక్కుపిండి వసూలు చేశారే గాని రోడ్డు వేయలేదు.
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మళ్లీ వస్తే అన్నీ బాదుడే బాదుడు అని చెప్పిన జగన్ చంద్రబాబు గత 5 సంవత్సరాల్లో కూడా వేయనన్ని ట్యాక్సులు కేవలం ఏడాదిలో వేసేశారు.