విడాకులిస్తానన్న లీడర్... పెళ్లాం నుంచి వావ్ రియాక్షన్

పార్టీ మారినందుకు విడాకులన్న ఎంపీ భర్తకు హార్ట్ టచ్ చేసేలా భార్య రియాక్షన్
బెంగాల్ రాజకీయం ఎంత హాట్ హాట్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధికార టీఎంసీ.. విపక్ష బీజేపీ నడుమ ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుతోంది. చివరకు ఈ రాజకీయ లొల్లి పచ్చని కాపురాల్లో నిప్పులు పోస్తోంది. అది కూడా.. ఏ కార్యకర్తో.. ఛోటా నేత అయితే అదో రకం. ఒక ఎంపీకి.. ఆయన సతీమణికి మధ్య నెలకొన్న రాజకీయ వైరుధ్యం వారు విడిపోయే వరకు వెళ్లటం సంచలనంగా మారింది.

బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ సతీమణి సుజాతా మండల్ ఖాన్ పార్టీ మారారు. ఇటీవల ఆమె టీఎంసీ (తృణమూల్‌ కాంగ్రెస్)లో చేరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా పార్టీ మారటం సంచలనంగా మారింది. టీఎంసీ నేతల్ని టోకుగా కాషాయం కండువా కప్పేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్న వేళ.. బీజేపీ ఎంపీ సతీమణి నేరుగా పార్టీ మారటమా? అన్నది షాకింగ్ గా మారింది. ఇదే విషయాన్ని సదరు ఎంపీని అడిగితే.. పార్టీ భార్య మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పదేళ్ల వైవాహిక బంధాన్ని తెంపేసుకునేందకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

అంతేకాదు.. విడాకుల దరఖాస్తును పంపుతానని.. ఇక ముందు తన ఇంటి పేరును ఆమె వాడుకోకూడదన్నారు. దీంతో.. ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. రాజకీయ రచ్చ పచ్చని పొలిటికల్ ఫ్యామిలీలో చిచ్చు రేగటంపై అందరిని ఆశ్చర్యపరిచింది.

బీజేపీ ఎంపీ సతీమణి ఎలాంటి కామెంట్లు చేయకుండా ఉండిపోయారు. తాజాగా ఆమె స్పందించారు. ‘‘ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన పార్టీలో ఉండి నాకు విడాకులు నా భర్త ఇస్తానంటున్నాడు. ఇది మంచిది కాదని ఆ పార్టీ వారు ఆయనకు ఎందుకు నచ్చ జెప్పటం లేదు? నేను మాత్రం ఆయన్ని ఇంకా ప్రేమిస్తున్నా. ఏదో ఒక రోజు ఆయన మనసు మారి టీఎంసీలోకి వచ్చేస్తారు’’ అంటూ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు.

ఓవైపు భర్త విడాకులు ఇస్తానంటున్నా.. బ్యాలెన్స్ మిస్ కాకుండా.. ఆయనపై తనకున్న ప్రేమను మాటలతో చెప్పిన సుజాత అందరి మనసుల్ని దోచేస్తున్నారు. ఇటీవల పార్టీలో చేరిన అవినీతిపరులకు పార్టీ గుర్తింపు ఇవ్వటాన్ని తట్టుకోలేక తాను పార్టీమారానని.. ఆ నిజాల్ని తన భర్త తెలుసుకొని ఆయన కూడా తన బాటలోనే నడుస్తారన్న ఆశను వ్యక్తం చేసిన ఆమె మాటలపై సదరు ఎంపీ రియాక్షన్ ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.