రెండున్నర సంవత్సరాలుగా ఓటర్లకు బటన్ నొక్కి డబ్బులు పంచుతున్న ఏపీ అక్కౌంటెంట్… సారీ… ఏపీ సీఎం జగన్ సర్కారు ప్రతినిధులు పార్లమెంటులో ఏడ్చినంత పనిచేశారు. రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందని ఆ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి అధికారికంగా పార్లమెంటులో వెల్లడించింది.
పార్లమెంట్లో మిథున్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే… అనేక హామీలతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల తలసరి ఆదాయంలో భారీ వ్యత్యాసం అంటే… రూ.15,454, రూ.8,977గా ఉంది. రెండు రాష్ట్రాల ఆదాయ వనరులకు కూడా భారీ వ్యత్యాసం ఉంది. ఆర్థిక ప్రోత్సాహం అవసరమైనందున ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరారు.
రాష్ట్రం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇక మావల్ల కావడం లేదు. కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందించండి. ఇకనైనా ఆలస్యం చేయకుండా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చండి. చట్టంలోని హామీలను పదేళ్లలో నెరవేరుస్తామని చెప్పి 8 ఏళ్లు గడిచిపోయాయి. కరుణించి డబ్బులు ఇవ్వండి.
ఇంతకాలం మీడియా ఏపీ ఆర్థిక తప్పుల గురించి వార్తలు ప్రసారం చేస్తే ఎల్లో మీడియా అంటే ముద్ర వేసి సామాన్యుల కళ్లు గప్పారు. ఇపుడు ఆ ఎల్లో మీడియా చెప్పినవే నిజాలు అని వైసీపీ సర్కారు స్వయంగా పార్లమెంటులో అంగీకరించింది.
ఎంతో కీలకమైన విషయాలు దృష్టిసారించకుండా ఓటు రాజకీయాలు, కుల రాజకీయలు, సినిమా వాళ్లపై కక్షపూరిత రాజకీయాలు చేస్తే ఇలాంటి దుర్భక్షమే వస్తుంది. వరదలు వచ్చిన వారికి పులిహోర అందించడానికి కూడా ప్రభుత్వంతో డబ్బులు లేక పార్లే బిస్కట్లు పంచారంటే ఏపీ దీన స్థితి ఏంటో అందరికీ అర్థమవుతుంది.
ఒకప్పుడు కాస్త విద్యావంతులు మాత్రమే ఏపీ గురించి ఆందోళన చెందారు. జగన్ కు ఆర్థిక క్రమశిక్షణ లేదని, అతనికి పరిపాలన రాదని.. ఇపుడు నిరక్షరాస్యులు అర్థం చేసుకునేంత దిగజారింది ఏపీ పరిస్తితి. మరి ఏం జరుగుతుందో చూడాలి.