బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవిలో ఉండి, అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదంటూ ఏపీ హైకోర్టు అసెంబ్లీ స్పీకరు తమ్మినేని సీతారాం ను హెచ్చరించింది. హైకోర్టు తీర్పులపై అసహనం, అసంతృప్తి ఉంటే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవాలి. అంతేగాని బహిరంగంగా కోర్టులపై వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు అంటూ హైకోర్టు తప్పుపట్టింది.
ఏపీలో నెలకొన్న పరిస్తితులు దేశంలో ఎక్కడా లేవు అంటూ హాట్ కామెంట్స్ చేసింది హైకోర్టు.
గతంలో పలుమార్లు న్యాయవ్యవస్థపై తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవి కోర్టు దృష్టికి రావడంతో హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. ఒకసారి కాదు… ఎక్కువ సార్లు స్పీకరుగా ఉండి పార్టీ తరఫున కామెంట్స్ మరింత తప్పుగా హైకోర్టు భావించింది.