సెంటు స్థలాల్లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు డివిజన్ బెంచ్. సింగిల్ జడ్జి తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్… దీంతో దిక్కుతోచని స్థితిలో పడిన వైసీపీ దీనిని ఏ విధంగా టీడీపీకి అంటగట్టాలి అనే ప్రయత్నాలు ప్రారంభించింది.
వాస్తవానికి కోర్టు ఇళ్ల పథకాన్ని ఆపలేదు. పేదలకు మంచి ఇళ్లు ఇవ్వమని చెప్పింది. మౌలిక సదుపాయాలతో కూడి ఇళ్లు ఇవ్వండి, మురికి వాడలను తయారు చేయొద్దు అని కోర్టు ఆదేశించింది. కరెంట్, త్రాగు నీరు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుచేసి జీవనానికి తగినంత ప్లేస్ లో ఇల్లు కట్టించి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం పేదలకు కట్ట వలసింది ఇల్లు, మురికి వాడలు కాదు అని న్యాయస్థానం పేర్కొంది.
అయితే, ఈ కోర్టు తీర్పుతో వైసీపీ సర్కారు సంబరాలు చేసుకుంటోంది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఖజానాల్లో డబ్బుల్లేవు. తాము ఆపితే ప్రజలకు కోపం వస్తుంది. కోర్టు ఆపితే అది టీడీపీ మీద తోసేయెచ్చు. ఒక్క ఇల్లు ఇవ్వకుండా ఇల్లు ఇచ్చిన లబ్ధిని పొందవచ్చని వైసీపీ సర్కారు సంబరపడుతోందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.