ఒక ఇంట్లో అప్పులు ఎవరు చేసినా ఎలా చేసినా … ఆ ఇంటిలో నివసించే వారే ఆ అప్పులు కట్టారు.
అలాగే ఒక రాష్ట్రంలో అప్పులు ఏ సీఎం చేసినా… ఆ అప్పులు తీర్చేది ఆ రాష్ట్ర ప్రజలే.
అంటే
అప్పులు కట్టడానికి డబ్బులు లేకపోతే అన్ని రకాల వస్తువులపై పన్నులు పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి డబ్బు బలవంతంగా సేకరించి అప్పు కడుతుంది. అది కూడా వడ్డీతో సహా.
అంటే మనకు గవర్నమెంటు నుంచి ఏం వచ్చినా అది మన డబ్బే. కాబట్టి ఉచితంగా అప్పనంగా తప్పుడు మార్గాల్లో ప్రభుత్వం డబ్బును వృథా చేస్తే ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రజలదే.
తాజాగా ఏపీలో కాగ్ లెక్కలు చూస్తే ఏపీ పౌరులకు మతిపోతుంది.
CAG report ప్రకారం 2019 ఏప్రిల్-2020 ఫిబ్రవరి మధ్య ప్రభుత్వ ఆదాయం 68,000 కోట్లు!
2018-19 లో ఇదే సమయంలో హయాంలో ప్రభుత్వ ఆదాయం 78,000 కోట్లు!
ఏటా ఎంతోకొంత ఆదాయం పెరుగుతుంది కానీ ఏకంగా 14% తగ్గడమనేది రాష్ట్ర ఆర్థిక దుస్థితిని తెలుపుతుంది!
ఇదే సమయంలో 2018-19లో మద్యంపై ఆదాయం 5000 కోట్లు కాగా .. 2019-20 లో 10,000 కోట్లకు చేరింది!
2019 ఫిబ్రవరి నాటికి 47,000 కోట్లు అప్పు చేయగా ..గత ఫిబ్రవరి నాటికే 32,000 కోట్లు ఎక్కువగా 79,000 కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం!
ఇదే సమయంలో తెచ్చిన అప్పులతో ఆదాయం కనీసం పెరగకపోగా .. 20% పైగా పడిపోవడం రాష్ట్ర పాలనా వైఫల్యానికి నిదర్శనం!
తెచ్చిన అప్పులని మౌలిక వసతుల అభివృద్ధి పక్కన పెడితే ..ఉన్న వాటిని నాశనం చేయడానికో/కూల్చడానికో ఖర్చు చేస్తూ జేబులు నింపుకుంటున్నారనిపిస్తుంది!