రుయాలో అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫలం కారణంగా నిమిషాల వ్యవధిలో 30కి పైగా ప్రాణాలు పోయిన అత్యంత విషాదకరమైన ఘటన తెలిసిందే.
అయితే, అపుడు ప్రభుత్వం కేవలం 11 మంది మాత్రమే అంటూ బుకాయించింది. మిగతావన్నీ కరోనా తీవ్రత మృతులు అని చూపించింది.
కానీ ఇన్నాళ్లకు ప్రభుత్వం తన తప్పును ఒప్పేసుకుంది. అయితే, నేరుగా ఆ విషయాన్ని ప్రకటించలేదు. ఆక్సిజన్ అందక మృతిచెందిన వారికి ఆర్థిక సహాయం ఇచ్చే లిస్టును తయారుచేయగా… ఆ విషయం బయటకు వచ్చింది.
23 మందికి ఎక్స్ గ్రేషియా ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
10వ తేదీన జరిగిన దుర్ఘటనలో 11 మంది మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ చెప్పింది అక్షరాల అబద్ధం అని ఈరోజు ప్రభుత్వమే ఒప్పుకున్నట్లయ్యింది.
ఈ ఘటనపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయగా.. బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి గవర్నర్‌కు లేఖ రాశారు. ఆయన న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు.
ఇదింకా పెద్ద రచ్చకు దారితీస్తుందేమో అన్న అనుమానం NHRC కి భయపడి ప్రభుత్వం ఎందుకైనా మంచిదని 23 మందికి ఎక్స్ గ్రేషియా ఇస్తోంది.
ఆక్సిజన్ నిల్వలపై సరైన పర్యవేక్షణ నిర్వహణ లేకపోవడం వల్ల జరిగిన ఈ మరణాలు ప్రభుత్వ హత్యలు అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు.