ఏపీ లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పెంపును ప్రారంభించారు. ఉచిత ఇసుక పాలసీని అమల్లోకి తెచ్చారు. డీఎస్సీ ప్రకటన వెలువడింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లు, స్కిల్ సెన్సెస్ ఇలా తదితర అంశాలపై వేగంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది.
ఇక తాజాగా రాష్ట్రంలో మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఆడబిడ్డ నిధి ఒకటి. ఈ పథకం ద్వారా 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ. 1500 చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతోంది. అయితే ఈ పథకానికి సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వచ్చే నెల నుంచి ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు మొదలు పెట్టింది అన్నదే ఆ వార్త సారాంశం. అలాగే ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే.. ప్రతి మహిళకు 18 సంవత్సరాలు వయసు దాటాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పుట్టిన తేదీ ధ్రువపత్రం, మహిళ పేరుతో బ్యాంకు ఎకౌంట్, పాస్ పోర్ట్ సైజు ఫోటోలు కలిగి ఉండాలి. అంతేకాకుండా ఆధార్ కార్డుతో ఫోను నెంబరు లింకు అయ్యి ఉండాలని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభుత్వం నుంచి ఈ పథకంపై ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు. ఒకవేళ నెట్టింట జరుగుతున్న ప్రచారం నిజమైతే మాత్రం.. అది ఖచ్చితంగా ఏపీ మహిళలకు తీపి కబురే అవుతుంది.
*ఏపీ మహిళామణులకు శుభవార్త*
కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల లో భాగంగా త్వరలో విడుదలయ్యే *ఆడబిడ్డ నిధి పథకానికి* ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల చొప్పున మంజూరు చేయడం జరుగుతున్నది.
ఈ దరఖాస్తు కు ముందస్తుగా రెడీ చేసుకోవాల్సిన ధ్రువపత్రాలు.
• ప్రతి మహిళకు 18 సంవత్సరాలు…— Rakesh Tummala #TDP2024 (@tummalarakesh6) July 7, 2024