ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా భారీ మెజారిటీ ఇచ్చి జగన్ ను గెలిపించారు. కానీ నేడు జగన్ పాలనతో పూర్తి అసంతృప్తితో ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే అది వీరే. ఒకప్పుడు ఉద్యోగ సంఘాలు ఎక్స్ ట్రా బెనిఫిట్ల కోసం, డీఏల కోసం, జీతాల పెంపు కోసం ధర్నాలు చేసేవారు. పైగా ముఖ్యమంత్రులను బెదిరించేవారు. కానీ జగన్ వీటన్నింటిని తిరగరాశాడు.
ఇపుడు టైం కి జీతాలు ఇవ్వాలని పోరాడుతున్నారు. కానీ సీఎం జగన్ ను ఒక్క మాట అనలేకపోతున్నారు. తిరుగుబాటు చేయాలని మనసులో బలంగా ఉన్నా ఏ కేసులో ఇరికించి ఏం చేస్తారో అని జగన్ చరిత్ర తెలిసిన వారు సైలెంటుగా ఆవేదన స్వరంతో పోరాటాలు చేస్తున్నారు. అదే గతంలో అయితే సీఎంలను తిట్టేవారు. కానీ ఇపుడు వారికి ఆ మాత్రం ప్రజాస్వామ్యపు హక్కులు వినిగియోంచుకునే ధైర్యం కూడా లేదు.
తాజాగా ఏపీలోని రెండు ఉద్యోగ సంఘాలు ఏకమయ్యాయి. రాష్ట్రంలోని ఉద్యోగులు మరియు పెన్షనర్ల ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు రెండు అతిపెద్ద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నాయకులు ప్రకటించారు. ఎపి జెఎసి చైర్మన్ బండి శ్రీనివాస్, ఎపి జెఎసి అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మరియు ఇతర నాయకులు శనివారం ఇక్కడ ఏపీఎన్జీవో అసోసియేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రెండు సంఘాల ఉమ్మడి లక్ష్యం ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంక్షేమమేనని బండి శ్రీనివాస్ అన్నారు.
AP JAC మరియు AP JAC అమరావతి సంయుక్తంగా ఇక నుంచి పోరాటాలు చేయనున్నట్లు ప్రకటించారు. జీతాలు, పెన్షన్లు మరియు ఇతర ద్రవ్య ప్రయోజనాల చెల్లింపులో జాప్యం కారణంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది, కాంట్రాక్ట్ కార్మికులు మరియు పెన్షనర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు చెప్పారు. ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఫిర్యాదులు మరియు సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు కోరుతున్నారు.
ఏపీ జెఎసి కొన్ని విభేదాల కారణంగా నాలుగు సంవత్సరాల క్రితం రెండు సంఘాలుగా విడిపోయింది మరియు ఇప్పుడు రెండు సంఘాల నాయకులు ఉద్యోగుల ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని సంకల్పించారు. APJAC అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో సకాలంలో జీతాలు మరియు పెన్షన్లు చెల్లించకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు పెద్ద సంఖ్యలో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పే రివిజన్ కమిషన్ను అమలు చేయాలని మరియు పెండింగ్లో ఉన్న డిఎ బకాయిలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు నిర్ణీత సమయంలో జీతాలు మరియు ఇతర ప్రయోజనాలను చెల్లించనందున ఉద్యోగుల సంఘాలు ఉద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు.
అయితే, ఉద్యోగుల ప్రెస్ మీట్ జరుగుతుండగానే సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేసి వారిని బెదిరించారని… ఆరోపణలు సోషల్ మీడియాలో హోరెత్తాయి. దానికి అనుగుణంగానే ఉద్యోగులు కూడా డిమాండ్ అనే పదం కంటే వినతిపూర్వకంగా మాట్లాడటమే కనిపించింది. ప్రభుత్వానికి మేము విధేయులమే కానీ ఉద్యోగుల ప్రయోజనం కోసం మా పోరాటాన్ని కొనసాగిస్తాం” అని ఆయన అన్నారు.
వివిధ విభాగాల నుండి. ఉద్యోగులు మరియు పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చొరవ తీసుకోవాలని వెంకటేశ్వర్లు అన్నారు. ఆర్థిక శాఖలోని కొందరు అధికారుల ఉదాసీనత కారణంగా రాష్ట్రంలో ఉద్యోగులు మరియు పెన్షనర్లు బాధపడుతున్నారని ఆయన అన్నారు. అసలు జగన్ నిర్ణయాల వల్ల ఆర్థిక పరిస్థితి దిగజారితే దానిని ఆర్థిక శాఖ ఉద్యోగుల మీద వేయడంలోనే జగన్ అంటే ఉద్యోగ సంఘాల్లో భయం కనిపిస్తోంది. జగన్ ప్రజలను, ఉద్యోగులను ఇంతలా ఎలా భయపెట్టగలుగుతున్నాడు అనేది ఎవరికీ అర్థం కాని విషయం.
నెలాఖరులోగా కాదు… సంవత్సరంలోగా కూడా… CPS రద్దు చేయకపోయినా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ మూసుకొని కూచునేలా చేసినందుకు…
ప్రతిఫలంగా చంద్రశేఖర్ రెడ్డికి సలహాదారు పోస్టు దక్కింది…????????????
ఈయనకి ఇంకోసారి సన్మానం చేయండి ప్రభుత్వ ఉద్యోగులారా…????????????#APinUnsafeHands #Ycheeps https://t.co/XO1csCPMd1 pic.twitter.com/kgFOM5lWGS
— Balaji Gupta (@BalajiGupta) September 27, 2021