• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

డేంజర్లో ఏపీ – ఇది కరోనా వార్త కాదు 

admin by admin
June 2, 2021
in Andhra, Top Stories, Trending
0
0
SHARES
824
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అవును ఆంధ్రప్రదేశ్ రోజురోజుకు డేంజర్లోకి వెళ్తోంది. రాష్ట్ర పరిస్థితి శృతిమించి ఒక కొత్త సంక్షోభాన్ని ప్రజలు ఎదుర్కోబోతున్నారు. సాధారణంగా ఇలాంటి సంక్షోభాలు వస్తే ఒక దేశం మొత్తానికి రావాలి. కాావాలి. ఒక రాష్ట్రానికి మాత్రమే ఇలాంటి సంక్షోభం పరిమితం అయ్యే పరిస్థితి వచ్చిందంటే అదింకా డేంజర్. ఆ డేంజర్ ఏంటంటే… ఏపీ అప్పు.  సాధారణంగా రాష్ట్రాలు చేసే అప్పు ప్రభావం ప్రజలపై నేరుగా పడదు. ఎందుకంటే సాధారణంగా అయితే ఆదాయ మార్గాలు అధికంగా ఉంటాయి కాబట్టి అప్పు ప్రభావం చూపదు. కానీ ఏపీలో ఆ పరిస్థితి లేదు.

​వైసీపీ రెండేళ్ల పాలనలో ప్రభుత్వం పెద్ద ఎత్తున నగదు వితరణ సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఒకవేళ అభివృద్ధి చేసుకుంటూ పోయి, ఆదాయ మార్గాలు పెంచుకుంటూ పోయి ఈ పని చేసి ఉంటే ఏపీకి డేంజర్ ఉండేది కాదు. కేవలం ఓటు రాజకీయంపై మాత్రమే ఆలోచించి ముందుకు వెళ్లారు. వచ్చే ఎన్నికల నాటికి అభివృద్ధి అనేది ఒక పాయింటే అవదు అనుకున్నారు. కరోనా రాకపోయి ఉంటే అలా గడిచిపోయేది. కానీ కరోనా రాకతో ప్రభుత్వం పరిస్థితి ఎలా అయ్యిందంటే… కుటుంబ యజమాని ఉద్యోగం పోతే ఆ ఇంటికి ఎలాంటి పరిస్థితి ఉందో అలా ఉంది ఏపీ పరిస్థితి.

ఈ విషయాన్ని మాజీ ఆర్థిక మంత్రి అయిన  యనమల రామకృష్ణుడు విపులంగా వివరిస్తూ జగన్ సర్కారు తీరుపై మండిప‌డ్డారు. రెండేళ్ల పాల‌న‌పై జగన్ పుస్తకం విడుదల చేసి గొప్ప‌లు చెప్పుకున్నారు. కానీ అందులో అనేక నిజాలు రాయకుండా వదిలేశారు.  అసత్యాలతో నిండిన పుస్తకాన్ని సీఎం హోదాలో ఉన్న వ్య‌క్తి విడుదల చేయటం అభ్యంతరకరం అన్నారు.

యనమల చెప్పిన పాయింట్లు:

గత 2 సంవత్సరాల్లో జగన్ చేసిన అప్పు 4 లక్షల 45 వేల కోట్లు (2014-2019 మధ్య ఐదేళ్లలో బాబు చేసిన అప్పు 1 లక్ష 40 వేల కోట్లు)

​2024 వచ్చే సరికి రాష్ట్రం అప్పు 6 లక్షల కోట్లు దాటుతుంది. దాని ప్రభావం ప్రజలకు నేరుగా పడుతుంది. అన్నీ కలిపి అపుడు ఏపీకి 8 లక్షల కోట్ల అప్పులుంటాయి.

అంటే ప్రతి సంవత్సరం బడ్జెట్ లో 60 వేల కోట్లు వడ్డీ కట్టాలి. మరో లక్షన్నర కోట్లు అసలు కట్టాలి. 

అంటే 2024 బడ్జెట్ నాటికి 2.1 లక్షల కోట్లు కేవలం అప్పుకే పోతుంది. ఇక రాష్ట్రం ఖర్చులకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు?

జ‌గ‌న్ అధికారంలోకి రాక‌ముందు ప్రత్యేక హోదా వస్తేనే ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. ప్రత్యేక హోదా సాధించి ఉంటే రాష్ట్ర ఆదాయం పెరిగేది.

​ప్రత్యేక హోదా, విభజన హామీలను గురించి కేంద్ర ప్ర‌భుత్వాన్ని జ‌గ‌న్ అడగట్లేదు.

Tags: andhrapradeshap debtsAP govtJagan
Previous Post

కేసీఆర్ పై పక్కా స్కెచ్…

Next Post

ఈ ఫొటో చూస్తే ఎవరికైనా కంట్లో నీరే

Related Posts

Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Movies

`కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!

June 22, 2025
Movies

నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!

June 22, 2025
Andhra

మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి

June 21, 2025
Andhra

మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌

June 21, 2025
Andhra

యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు

June 21, 2025
Load More
Next Post

ఈ ఫొటో చూస్తే ఎవరికైనా కంట్లో నీరే

Please login to join discussion

Latest News

  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
  • `యోగాంధ్ర`పై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు.. బాబు స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!
  • చంద్ర‌బాబా మ‌జాకా.. ప‌ట్టుబ‌ట్టారు.. రికార్డు కొట్టారు..!
  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra