అమరావతి: మూడు రాజధానుల బిల్లును, ఏపీ సర్కారు తెచ్చిన సీఆర్డీఏ బిల్లును రద్దు చేస్తూ ఏపీ సీఎం జగన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం రాష్ట్రానికి ఒకే రాజధాని, అది అమరావతి అని ప్రకటించారు.
ఈ ప్రకటనతో మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవాలని, నిర్ణయాన్ని హైకోర్టుకు తెలియజేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. YSRCP ప్రభుత్వం రాష్ట్రానికి మూడు వేర్వేరు రాజధానులను ప్రతిపాదించింది, శాసనసభ రాజధాని అమరావతి, కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం మరియు న్యాయ రాజధానిగా కర్నూలు.
రాష్ట్ర రాజధాని నగరాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించాలని, అందులో కేంద్రం పాత్ర లేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గత ఏడాది ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తెలియజేసింది.
అయితే అమరావతి రైతుల అలుపెరగని పోరాటం, రాష్ట్ర ప్రజల నుంచి వారికి నైతిక మద్దతు లభిస్తున్న నేపథ్యంలో జగన్ మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకున్నారు. తన మొండి పట్టుదలను వీడి అమరావతికే జగన్ జైకొట్టారు.
ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఎవరు నడుచుకున్నా దిగిరాక తప్పదు, ఇది నియంతృత్వం కాదు… రాష్ట్రం అనేది ప్రజలది గాని ముఖ్యమంత్రి సొంత సామంత రాజ్యం కాదు నిరూపితమైంది. ప్రజాస్వామ్యం గెలిచింది.