ప్రస్తుతం ఏపీలో కులాల మధ్య రాజకీయాలు తగ్గాయి. ఇది ఒకింత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. నిజమేనని అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికలకు రెండేళ్ల ముందు.. వైసీపీఅ ధినేత జగన్ పాదయాత్ర చేశారు. దీంతో అప్పట్లో ఎన్నికలకు ముందుగానే కులాల మధ్య చర్చ జరిగింది. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం ఇతర వర్గాలను కలుపుకొని ముందుకు సాగింది. దీంతో ఎన్నికలకు చాలా రోజుల ముందే.. రాజకీయాలు చర్చకు వచ్చాయి.
కానీ.. ఇప్పుడు అలాంటి పరిస్తితి లేదు. రెడ్డి వర్గమే.. ఎటూ తేల్చుకోలేక పోతోందనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా.. తమకు ఏమీ జరగడం లేదని బాధపడుతున్నరెడ్డి వర్గం కూడా.. ఇతర పార్టీలవైపు చూడలేకపోతోంది. నిజానికి వైసీపీ ప్రభుత్వంలో రెడ్డి వర్గం చేసే వ్యాపారాలపై తీవ్రమైన ప్రభావం చూపిం ది. సినిమా డిస్ట్రిబ్యూషన్ నుంచి రైస్ మిల్లింగ్ వరకు.. ఈ వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి.
ఆయా వ్యాపారాల్లో ఎక్కువగా రెడ్లే ఉన్నారు. దీంతో కొన్నాళ్ల కిందట వైసీపీని వదిలేద్దాం.. అనే టాక్ వచ్చింది. కొందరు రెడ్డి నేతలు .. సైతం సమావేశాలు పెట్టుకుని.. జగన్ వల్లతమకు ఏమీ జరగడం లేదని చెప్పుకొచ్చారు. అయితే..ఎందుకో ఇప్పుడు సైలెంట్ అయ్యారు. దీనికికారణం.. ఇతర ప్రధాన పార్టీలపై వారికి స్పష్టత లేకపోవడమేనని తెలుస్తోంది.
ఇక, బీసీ లు కూడా ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. వారికి ఆది నుంచి కూటీ టీడీపీ అండగా ఉంది. అయితే.. వైసీపీ అధినేత జగన్… పవర్ తన వద్ద ఉంచుకుని మంత్రులు, ఇతర నామినేటెడ్ పదవులు.. స్థానిక సంస్థల్లో చైర్మన్లు ఇలా అనేక అవకాశాలు ఇచ్చాడు. పవర్ లో ఉన్నోళ్లకి మాత్రమే పవర్ లేదు తమకు అని అర్థమైంది. కానీ ఆయా కులాల్లో మాకు పదవులు ఇచ్చాడు అనే భ్రమలో వారిని జగన్ ఉంచాడు. అంటే జగన్ చేసి కుల గేమ్ లో సామాన్యులు ఇరుక్కుపోతున్నారు.
కాకపోతే సామాన్యుడి జేబుపన్నులతో వాయిస్తుండటం, ఉద్యోగాలు, రోడ్లు వంటి కీలక విషయంలో జగన్ ఫెయిల్ కావడం, అనాదిగా తమకు వస్తున్న పథకాలు జగన్ కోసేయడంతో బీసీలు ఇపుడు మేల్కొంటున్నారు. దీంతో ఇటు టీడీపీవైపు ఉండాలా.. అటు వైసీపీ వైపు నడవాలా? అనే డైలమా నుంచి వైసీపీ వద్దురో బాబోయ్ అనే మూడ్ లోకి జనం వెళ్లిపోతున్నారు. అయితే ఇప్పటికే మాల, హిందు ఎస్సీ, బ్రాహ్మణ, కమ్మ, వైశ్య సామాజిక వర్గాల్లో టీడీపీకి ఆదరణ పెరిగింది. మిగిలిన రెండు డోలాయమానంలోనే ఉన్నాయి. ఇక, కాపులు ప్రస్తుతానికి జనసేనవైపు ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.